Site icon NTV Telugu

Indian Army Day 2026: సెల్యూట్ జవాన్! భారత సైనికులు మైనస్ 50 డిగ్రీల వద్ద ఎలా గస్తీ కాస్తారో తెలుసా?

Jawan

Jawan

Indian Army Day 2026: ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైన్య దినోత్సవం (Indian Army Day)ను ఘనంగా జరుపుకుంటాం. భారత సైనిక చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకునే రోజే ఇది. 1949 జనవరి 15న ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కారియప్ప భారత సైన్యానికి తొలి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర్యం తర్వాత రక్షణ రంగంలో దేశం స్వయంప్రతిపత్తి సాధించిన ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అప్పటి నుంచి ఏటా ఆర్మీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నేడు 78వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం..

READ MORE: BMC Elections Controversy: మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంక్ వార్.. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల సంచలన ఆరోపణలు!

జనవరి 2026లో లద్దాఖ్, ద్రాస్ ప్రాంతాల్లో చలి అత్యంత తీవ్రంగా ఉంటుంది. ద్రాస్ భారతదేశంలోనే అత్యంత చలిగా ఉండే నివాస ప్రాంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. భారీగా మంచు కురవడంతో రహదారులు పూర్తిగా మూసుకుపోతాయి. దూరంలోని సైనిక పోస్టులు నెలల తరబడి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాయి. తాజాగా ద్రాస్‌లో ఈ సీజన్ తొలి మంచు పడింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం తెల్లని మంచు పొరతో కప్పబడిపోయింది. పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ వద్ద, చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత సైనికులు 14 వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తులో విధులు నిర్వహిస్తుంటారు. ఈ ఎత్తులో గాలిలో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. తీవ్రమైన చలి వల్ల శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది.

READ MORE: మహీంద్రా XUV 7XO డెలివరీలు స్టార్ట్.. ధర, స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయంటే..?

ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. తీవ్రమైన చలిలో శ్వాసలోని ఆవిరే గడ్డకట్టిపోతుంది. చేతులు, కాళ్లు వంటి శరీర భాగాలు గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆక్సిజన్ కొరతతో తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. ఈ మంచు వల్ల రహదారులు మూసుకుపోవడంతో పోస్టుల వరకు చేరడం కష్టమవుతుంది. ఎప్పుడైనా మంచు కొండలు జారిపడే ప్రమాదం కూడా ఉంటుంది. నదులు గడ్డకట్టిపోవడంతో తాగునీటి కొరత ఏర్పడుతుంది. అయితే సైన్యం ముందుగానే నీరు, ఆహారాన్ని నిల్వ చేస్తుంది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా, ఒంటరిగా ఉండాల్సి రావడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అయినా సైనికులు ధైర్యంగా తమ విధులను నిర్వర్తిస్తారు.

READ MORE: MS Dhoni: వామ్మో.. ఈ ఏజ్‌లోనూ తగ్గని ఉత్సాహం.. ఆఫ్-రోడింగ్‌కు ఎంఎస్ ధోని, సల్మాన్

ఇలాంటి పరిస్థితులకు భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. సియాచిన్, కార్గిల్ వంటి ప్రాంతాల్లో పొందిన అనుభవంతో సైన్యం బలమైన ఏర్పాట్లు చేసుకుంది. అత్యంత చలిని తట్టుకునే ప్రత్యేక దుస్తులు సైనికులకు అందిస్తారు. ఇవి పలుచటి పొరలతో ఉండే జాకెట్లు, గ్లోవ్స్, బూట్లు, థర్మల్ దుస్తులు కలిగి ఉంటాయి. వేల సంఖ్యలో ఈ దుస్తులను ముందుగానే నిల్వ ఉంచుతారు. సైనికులు ఉండేందుకు ప్రత్యేకంగా వేడి ఉండే టెంట్లు, ఫైబర్ గ్లాస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. బయట మైనస్ 20 డిగ్రీలు ఉన్నా, లోపల 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. హెలికాప్టర్లు, ట్రక్కుల ద్వారా ఆహారం, ఇంధనం, మందులు సరఫరా చేస్తారు. తీవ్రమైన చలిలో కూడా పనిచేసే ప్రత్యేక ఇంధనం, బ్యాటరీలు వాడుతారు. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ఉపగ్రహాల ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. వైద్య బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సైనికుల ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు.

READ MORE: Honey Trap: శృంగార వల.. 100 మంది బలి.! కరీంనగర్ దంపతుల గలీజ్ దందా.!

చలికాలంలో కూడా సైనికులు గస్తీ, నిఘా కొనసాగిస్తారు. లేహ్‌లోని 14 కార్ప్స్ వంటి యూనిట్లు భారీ ఆయుధాలను కూడా ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తాయి. ఇది వారి శారీరక సామర్థ్యాన్ని, క్రమశిక్షణను చూయిస్తుంది. ఇటీవల భారత సైన్యం ద్రాస్‌లో ‘జష్న్-ఏ-ఫతే 2026’ అనే వింటర్ కార్నివల్‌ను ప్రారంభించింది. ఇందులో ఐస్ హాకీ, విలువిద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక యువతను దగ్గర చేయడం, పౌరులు–సైన్యం మధ్య బంధాన్ని బలపరచడం దీని లక్ష్యం. సైనికులు కేవలం సరిహద్దులను కాపాడటమే కాదు, ఆ ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారన్నదానికి ఇది ఉదాహరణ.

Exit mobile version