Site icon NTV Telugu

Indian 2 : ఇండియన్ 2 మూవీ షూటింగ్ పూర్తి..సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్..?

Whatsapp Image 2024 01 02 At 12.30.03 Pm

Whatsapp Image 2024 01 02 At 12.30.03 Pm

విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్‌ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం అలాగే నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్‌ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూనే ఇండియన్ 2 సినిమా ను కూడా డైరెక్ట్ చేశాడు . దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీకి 2024 కొత్త ఏడాది తొలిరోజున మోక్షం కలిగింది. ఎట్టకేలకు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను పూర్తిచేశాడు.

చెన్నైలో జరిగిన తాజా షెడ్యూల్‌ తో ఇండియన్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిన సందర్భంగా సినిమా యూనిట్‌తో కమల్‌హాసన్ ఓ ఫొటోను దిగారు . కమల్‌హాసన్‌తో పాటు శంకర్ కెరీర్‌లో ఎక్కువ కాలం షూటింగ్‌ ను జరుపుకున్న మూవీగా ఇండియన్ 2 నిలిచింది.ఇండియన్ -2లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా సిద్ధార్థ్‌ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌ మరియు ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఇండియన్ 2 మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇండియన్ 2 సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన కమ్ బ్యాక్ ఇండియన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇండియన్ 2 సినిమా ను దర్శకుడు శంకర్ ఎంతో రిచ్ గా తెరకెక్కిస్తున్నారు. అదిరిపోయే విజువల్స్ తో ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా ఉండనున్నట్లు సమాచారం.

Exit mobile version