విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.
ఇక మేకర్స్ నుండి వచ్చే నెలలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోండగా పాన్ ఇండియా మార్కెట్లో అతి పెద్ద తమిళ సినిమాగా అవతరించగలిగే క్రేజ్ ఉందని మేకర్స్ నమ్ముతునాన్రు. సమ్మర్ రిలీజ్ తో లాభ పడగలం అని అంచనాలు ఉండడంతో మేలో మంచి డేట్ మీద కన్నేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఇండియన్ 2 నైజాం హక్కులు ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాకి శంకర్ ఒకేసారి పని చేయాల్సి రావడంతో రెండు సినిమాల షూటింగులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
అలాంటి వార్తలు రిపీట్ కాకుండా సినిమాను విడుదల చెయ్యాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
