NTV Telugu Site icon

Indian 2 : నేడే గ్రాండ్ ఆడియో లాంచ్ …స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్న చిత్ర యూనిట్..

Indian2

Indian2

Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,కాజల్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Read Also :Ileana : ఒక్క అవకాశం ఇవ్వండి … టాలెంట్ చూపిస్తానంటున్న గోవా బ్యూటీ..

ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,గ్లింప్సె ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో లాంచ్ ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు గ్రాండ్ గా నిర్వహించనున్నారు.తాజాగా ఈ ఈవెంట్ కి గురించి తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.అలాగే ఈ ఈవెంట్ స్పెషల్ సర్ప్రైస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Show comments