NTV Telugu Site icon

Indian 2 : గ్రాండ్ గా ఆడియో లాంచ్ ప్లాన్.. అతిధులుగా రానున్న బడా స్టార్స్..?

Whatsapp Image 2024 04 29 At 8.48.36 Am

Whatsapp Image 2024 04 29 At 8.48.36 Am

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా ఈమూవీ తెరకెక్కింది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేసింది.ఈ మూవీ లో సిద్దార్థ్‌, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్‌ వంటి తదితరురులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్‌ లుక్ పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.ఇటీవలే మేకర్స్‌ షేర్ చేసిన కమల్ హాసన్‌ నయా లుక్‌ వైరల్ అవుతుంది . సేనాపతిగా డ్యుయల్‌ షేడ్స్‌లో కనిపిస్తూ కమల్ అదరగొట్టారు . ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే మే 16న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇండియన్ 2 ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా ఈవెంట్‌కు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈవెంట్‌కు రాంచరణ్‌ మరియు రజినీకాంత్‌ గెస్టులుగా రానున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి వుంది.