NTV Telugu Site icon

Indian 2 : గ్రాండ్ గా ఆడియో లాంచ్..వైరల్ అవుతున్న గెస్ట్ లిస్ట్..

Indian 2

Indian 2

Indian 2 : తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాను జులై 12 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Read Also :Salaar 2 : ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. ఆ సినిమా ఇక లేనట్టే..?

ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.శౌర అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే నటుడు కమల్ హాసన్ ఈ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో ఇండియన్ 2 తో పాటు ఇండియన్ ౩ కూడా తెరకెక్కించినట్లు తెలిపారు.ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు.అలాగే ఇండియన్ 2 ఆడియో రిలీజ్ జూన్ 1 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.అయితే ఈ ఆడియో లాంచ్ కి వచ్చే గెస్ట్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఈవెంట్ కు బాలీవుడ్ నుంచి రణ్ వీర్ సింగ్ ,టాలీవుడ్ నుంచి చిరంజీవి ,రాంచరణ్ ,అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్ హాజరు కానున్నట్లు సమాచారం.అలాగే స్టార్ డైరెక్టరు మణిరత్నం కూడా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నట్లు సమాచారం.

Show comments