Site icon NTV Telugu

Indian 2 : ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు..

Whatsapp Image 2023 08 03 At 12.25.38 Pm

Whatsapp Image 2023 08 03 At 12.25.38 Pm

విశ్వనటుడు..కమల్‌ హాసన్‌ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో 26 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎంతో సంచలనం సృష్టించింది.. తమిళం లో రూపొందిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందుకే గత కొన్నేళ్లుగా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు శంకర్ ప్రారంభించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగి పోయింది. దీనితో శంకర్ రామ్‌ చరణ్ తో ఒక సినిమా ను మొదలు పెట్టాడు. ఇంతలోనే కోర్టు ఆదేశాలు అలాగే ఇతర విషయాల కారణంగా ఇండియన్‌ 2 సినిమా ను శంకర్ మళ్లీ మొదలు పెట్టాడు.

శంకర్‌ చాలా ప్రతిష్టాత్మకంగా ఇండియన్ 2 సినిమా ను చేస్తున్నాడు.ఇండియన్ 2 సినిమా ను రికార్డు స్థాయి బడ్జెట్‌ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.. షూటింగ్‌ ప్రారంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ఏడాది లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇండియన్ 2 సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ఇండియన్‌ 2 సినిమా ఇంకా ఎన్నాళ్లు షూటింగ్‌ చేస్తారు అంటూ అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో కమల్‌ హాసన్ అభిమానులు చాలా మంది దర్శకుడు శంకర్‌ ను ట్యాగ్‌ చేసి ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యేది ఎప్పుడు సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. శంకర్ మాత్రం ఆ కామెంట్స్ కు అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక కమల్‌ హాసన్ కూడా ఇండియన్ 2 ఎప్పుడు పూర్తి అవుతుందో కచ్చితంగా చెప్పడం లేదు.

Exit mobile version