Indian 2 : ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు..కమల్ హాసన్ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో 26 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా ఎంతో సంచలనం సృష్టించింది.. తమిళం లో రూపొందిన ఈ సినిమా హిందీ మరియు తెలుగు లో రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేయడం జరిగింది. అందుకే గత కొన్నేళ్లుగా అభిమానులు ఇండియన్ 2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు శంకర్ ప్రారంభించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగి పోయింది. దీనితో శంకర్ రామ్ చరణ్ తో ఒక సినిమా ను మొదలు పెట్టాడు. ఇంతలోనే కోర్టు ఆదేశాలు అలాగే ఇతర విషయాల కారణంగా ఇండియన్ 2 సినిమా ను శంకర్ మళ్లీ మొదలు పెట్టాడు.
శంకర్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇండియన్ 2 సినిమా ను చేస్తున్నాడు.ఇండియన్ 2 సినిమా ను రికార్డు స్థాయి బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.. షూటింగ్ ప్రారంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ఏడాది లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇండియన్ 2 సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ఇండియన్ 2 సినిమా ఇంకా ఎన్నాళ్లు షూటింగ్ చేస్తారు అంటూ అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో కమల్ హాసన్ అభిమానులు చాలా మంది దర్శకుడు శంకర్ ను ట్యాగ్ చేసి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడు సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. శంకర్ మాత్రం ఆ కామెంట్స్ కు అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 ఎప్పుడు పూర్తి అవుతుందో కచ్చితంగా చెప్పడం లేదు.
Also Read
- Tags
- #kamalhasan
- Indian-2
- Shankar
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు