NTV Telugu Site icon

Indian 2 : ఆయనే ఈ సినిమాలో ఫైట్స్ కు ప్రేరణ.. డైరెక్టర్ శంకర్ వివరణ..

Indian 2

Indian 2

Indian 2 : ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా మరిన్ని దేశాలలో ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాలలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. టెక్నికల్ డైరెక్టర్ శంకర్ హీరో కమలహాసన్ కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈ ట్రైలర్ లో చూసినట్లుగా అయితే సేనాపతిగా కమలహాసన్ చేసిన సీన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే అదే సమయంలో కొన్ని లాజిక్స్ తో పాటు మరికొన్ని అనుమానాలు కూడా బయటకు వచ్చాయి.

IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు ‘నో రిజర్వ్‌ డే’.. కారణం ఏంటంటే?

ఈ సినిమాలో భారతీయుడిగా కమల్ హాసన్ వయసు 106 ఏళ్లు ఉంటుందని సమాచారం. మరి ఆ వయసులో ఉన్న తాత ఈ రేంజ్ లో ఫైట్లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యమవుతాయంటూ.. శంకర్ పై, కమల్ హాసన్ పై కొన్ని కామెంట్స్ వినిపించాయి. అయితే దీనికి డైరెక్టర్ శంకర్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రశ్న ఇదివరకే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే ఎదురవ్వగా.. దానికి తాజాగా శంకర్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. 106 సంవత్సరాల వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం చాలా సాధ్యమే అంటూ సమాధానం ఇచ్చారు. చైనా దేశంలో లూజియా అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇప్పటికీ 120 ఏళ్ల వయసులో కూడా గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన గాల్లో ఎగురుతూ కిక్స్ ఇస్తూ., ఫైట్స్ చేస్తున్నారని ఆయన ప్రేరణతోనే సేనాపతి పాత్రను తీర్చిదిద్దినట్లుగా శంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో సినిమాపై వచ్చిన ట్రోల్స్ పై శంకర్ ఇచ్చిన సమాధానం పులిస్టాప్ పెట్టనుంది.

Show comments