Arundhati Reddy: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. భారత మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించి ప్రపంచ కప్ గెలుచుకుంది. తొలిసారి టీమిండియా ప్రపంచకప్ ను ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఎలాంటి తడబాటు లేకుండా అదరగొట్టింది. వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి ఉండటం మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం. అయితే.. తాజాగా అరుంధతి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వరల్డ్ కప్ సాధించడం ఎంతో గర్వకారణం అని వెల్లడించింది.
READ MORE: SEBI: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. రూ.10కి బంగారం కొనేవారికి సెబీ తీవ్ర హెచ్చరిక
వరల్డ్ కప్ ప్రారంభంలో ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం ఓటములతో ఢీలా పడింది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిన విషయం తెలిసిందే. “వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి ఏంటి..?” అని యాంకర్ ప్రశ్నించారు. ఎంతో బాధగా ఉన్నామని అరుంధతి చెప్పింది. “ఓకే ఇంతవరకు అయ్యిందేదో అయిపోయింది. మళ్లీ దాన్ని తలుచుకుని బాధపడటం అనవసరం. ఇక నుంచి మనం ఏం చేయాలి..? అనే అంశంపై చర్చించాం. అలాగే ఓడిన మ్యాచ్‌లకు సంబంధించిన రివ్వ్యూస్ కూడా చేశాం. ఎక్కడ తప్పులు చేశాం? అనే విషయాలను గురించి తెలుసుకున్నాం. అలా చర్చించుకుంటూ పోతే చాలా తప్పులు దొరుకుతాయి. అందుకే ఆ అంశంపై ఎక్కువగా చర్చించడం ఆపేశాం. ఇక వాట్ నెక్ట్స్.. ఇప్పుడు ఏం చేస్తే మనం ఈ న్యూజిలాండ్ మ్యాచ్ గెలుస్తాం..? అనే అంశంపై ఎక్కువగా చర్చించాం. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ మాపై కొంచెం సిరియస్ అయ్యారు. ఆయన ఇంటెన్సన్ గెలవాలనే.. మా టీం ఎంతో బలమైంది. కానీ.. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయాం. అందుకే ఎమోషన్ అయ్యారు. అనంతరం.. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన ఇద్దరు మీటింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు అయిపోయింది పక్కన పెట్టండి. ఇక నుంచి ఏంటి..? మనం వరల్డ్ కప్ సాధించడానికి ఏం చేయాలి..? న్యూజిలాండ్‌ను ఎలా ఎదుర్కోవాలనే టాపిక్స్‌పై చాలా వరకు చర్చించాం.” అని అరుంధతి వెల్లడించింది.
