Site icon NTV Telugu

Winter Solstice 2023: నేడే శీతాకాలపు అయనాంతం.. ఈ రోజు పగలు తక్కువగా.. రాత్రి ఎక్కువ.. ఎందుకో తెలుసా?

Winter Solstice 2023

Winter Solstice 2023

ఈ రోజు శుక్రవారం డిసెంబర్ 22కు ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా నేటి రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది. అంటే తక్కువ పగలు.. ఎక్కువ రాత్రి ఉండబోతోంది. ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22వ తేదీల్లో మాత్రమే ఇలా జరుగుంది. అదీ కూడా ఒక్క భారతదేశంలో మాత్రమే. ఈ దృగ్విషయాన్ని శీతాకలపు అయనాంతంగా(Winter Solstice) పిలుస్తారు. అయితే శీతాకాలపు ఆయనాంతం అంటే ఏంటీ? ఇది ఎలా ఏర్పుడుతుందో ఓసారి చూద్దాం!

ఎందుకిలా అంటే..
భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగినప్పుడు ‘శీతాకాలపు అయనాంతం’ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి తన అక్షం మీద 23.4 డిగ్రీలు వంగుతుంది. ఈ కారణంగా భూమి ధ్రువం పగటిపూట సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడు ప్రయాణించే ఆర్క్ సంవత్సరంలో పెరుగుతూ.. తరుగుతూ ఉంటుంది. అందుకే అతి తక్కువ పగలు ఉండనుంది. దీంతో సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగానే డిసెంబర్ 22 శుక్రవారం భారత కాలమానం ప్రకారం ఉదయం 8.57 గంటలకు శీతాకాలపు అయనాంతం సంభవించింది. ఫలితంగా ఉత్తరార్థ గోళంలో అతి తక్కువ పగటిపూట సంభవిస్తుంది. 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు ఉంటుంది. పగలు తర్వగా ముగిసి, రాత్రి త్వరత్వరగా ప్రారంభమవుతుంది. దాదాపు 13 గంటల 38 నిమిషాల పాటు రాత్రి సమయం ఉంటుంది. ఈ ఏడాది జూన్ 21వ తేదీన కూడా ఇదే తరహాలో లాంగెస్ట్ డే నమోదైంది. ఈ రోజు సూర్యోదయం తరువాత, సాయంత్రం సూర్యాస్తమయం ఇతర రోజుల కంటే ముందుగానే ఉంటుంది. సూర్యకాంతి ఈరోజు భూమిపై కేవలం 10 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రోజు రాత్రి సంవత్సరంలోనే అతి పెద్దది కానుంది. ఈరోజు ఉత్తర ధృవానికి స్వల్ప సూర్యకాంతి మాత్రమే తాకుతుంది. ఫలితంగా రాత్రి ఎక్కువ సేపు ఉంటుంది. ఈ ఏడాది జూన్ 21న ఇదే తరహాలో లాంగెస్ట్ డే నమోదైంది.

Exit mobile version