Site icon NTV Telugu

Ind vs WI: తొలి రోజు ముగిసిన ఆట.. రాహుల్ అర్ధ సెంచరీ.. భారత్ స్కోరు ఎంతంటే..?

Ind

Ind

India vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ మొదటి రోజు ముగించే సరికి.. రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. సిరాజ్ నాలుగు వికెట్లు, బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ సైతం రెండు వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) కి చాలా కీలకం.

REDA MORE: CM Chandrababu: మహాత్మాగాంధీ అంటే‌ గుర్తొచ్చేది ఖద్దర్.. స్వాతంత్రోద్యమ‌ స్ఫూర్తి రాట్నమే..

అయితే.. భారత జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, జైస్వాల్ 36 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ సైతం ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సైతం క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు శుభారంభం లభించలేదు. వెస్టిండీస్ 12 పరుగుల వద్ద తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (0) వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం.. జస్ప్రీత్ బుమ్రా మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (8 )ను అవుట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ మరో రెండు వికెట్లు పడగొట్టి విధ్వంసం సృష్టించాడు. లంచ్‌కు ముందు, కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌ను మరో దెబ్బ తీశాడు. షాయ్ హోప్ వికెట్ కోల్పోయాడు. సుందర్ వెస్టిండీస్ ఏడో వికెట్ తీశాడు. బూమ్రా 8,9వ వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Exit mobile version