Site icon NTV Telugu

Sree Charani: పల్లెటూరు టు ఇంటర్నేషనల్.. టీమిండియాలోకి మరో కొత్త తెలుగమ్మాయి అరంగేట్రం..!

Sree Charani

Sree Charani

Sree Charani: నేడు కొలంబో వేదికగా మహిళల వన్డే ట్రై-సిరీస్‌ మొదలు అవుతుంది. ఇందులో భాగంగా నేడు మొదటి మ్యాచ్ భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇద్దరు మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెడుతున్నారు. శ్రీ చరణి, కాశ్వీ గౌతమ్ లు తమ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ను నేడు ఆడుతున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ వారిని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో శ్రీ చరణి (20) తెలుగు అమ్మాయి కూడా ఆరంగేట్రం చేసింది.

శ్రీ చరణి కడప జిల్లాకు చెందిన ఒక యువ మహిళా క్రికెటర్. ఆమె ఇటీవల దేశవాలీ మ్యాచుల్లో మంచి ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. తన అద్భుత ప్రదర్శనతో ఆమెను శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్ టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. అయితే ఈ సిరీస్ లో కేవలం రెండు మ్యాచ్లు ఆది నాలుగు వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.

శ్రీ చరణి కుటుంబం గురించి చూసినట్లయితే.. శ్రీ చరణి స్వస్థలం కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం ఎర్రమల్లె గ్రామం. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. శ్రీ చరణి ఐపీఎల్‌లో రాణించడంతో ఇప్పుడు జాతీయ జట్టులో చోటు సంపాదించింది. దీనితో ఆమె గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. శ్రీ చరణి బౌలింగ్ మాత్రమే కాకుండా.. బ్యాటింగ్‌లో కూడా మంచి ప్రదర్శన చేయగలదు. శ్రీ చరణి ఇప్పటివరకు తన కెరీర్‌లో 131 స్ట్రైక్ రేట్‌ తో 84 పరుగులు మాత్రమే చేసింది. కొలంబోలో మహిళల ట్రై- సిరీస్ జరుగుతోంది. ఇందులో భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నమెంట్ నేటి (ఏప్రిల్ 27) నుంచి మే 11 వరకు జరగనుంది. ఈ సిరీస్ మొత్తం కొలంబోలోని స్టేడియంలో జరుగనున్నాయి. శ్రీ చరణి తన ప్రదర్శన ద్వారా ఇంకా పెద్ద విజయాలు సాధించాలని కోరుకుందాము.

Exit mobile version