India vs South Africa Test Squad 2025: నవంబర్ 14న స్వదేశంలో భారత్ – దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును తాజాగా ప్రకటించారు. ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మహమ్మద్ షమీని మరోసారి పక్కనపెట్టారు. ఇటీవల జట్టు ఎంపికపై జరిగిన మాటల యుద్ధం తర్వాత షమీకి సిరీస్‌లో అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ తాజాగా విడుదలైన జట్టు జాబితాలో షమీ పేరు లేదు. తాజాగా భారత జట్టులోకి ఎవరు తిరిగి వచ్చారు, అలాగే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Tata Motors EV: టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.1.30 లక్షల డిస్కౌంట్.. త్వరపడండి
రీఎంట్రీ ఇచ్చిన పంత్..
రాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం BCCI సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తారు. ఈ టెస్ట్ సిరీస్ భారతదేశం – దక్షిణాఫ్రికా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌గా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్ పరంగా కూడా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈక్రమంలో భారత జట్టులోకి రిషబ్ పంత్ తిరిగి రావడం కూడా పెద్ద వార్తగా క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌లో జరిగిన మాంచెస్టర్ టెస్ట్ సందర్భంగా పంత్ తీవ్ర గాయంతో మైదానాన్ని విడిన సంగతి తెలిసిందే. ఇటీవల పంత్ కోలుకొని దక్షిణాఫ్రికా Aతో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో పంత్ బలమైన ఇన్నింగ్స్‌తో తాను గాయం నుంచి కోలుకున్నాను అనే సంకేతాలను సెలక్షన్ కమిటీకి పంపించాడు. ఇప్పుడు పంత్ జట్టులోకి తిరిగి రావడం WTC దిశగా జట్టుకు శుభసూచకంగా మారుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరెవరు ఉన్నారంటే..
భారత టెస్టు జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, నితిశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్.
ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. రెండవ టెస్ట్ నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రారంభం అవుతుంది. ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టు సమతుల్యతను బలోపేతం చేయగా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కొత్త బంతి బౌలింగ్ విభాగానికి అనుభవాన్ని తీసుకువస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా జట్టులోకి రావడంతో అతనికి ఈ టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
READ ALSO: Rishabh Pant: టీమిండియాలోకి స్టార్ ప్లేయర్ రీఎంట్రీ.. ఎవరో తెలుసా?
🚨 News 🚨#TeamIndia squad for Test series against South Africa and India A squad against South Africa A announced.
Details 🔽 | @IDFCFIRSTBank https://t.co/dP8C8RuwXJ
— BCCI (@BCCI) November 5, 2025
