Site icon NTV Telugu

India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్‌.. బౌలర్‌ను మార్చిన సూర్య! రిజల్ట్ చూశారుగా..

India Vs South Africa

India Vs South Africa

India vs South Africa: భారత బౌలర్లపై దక్షిణాఫ్రికా గట్టిగానే పోరాడింది. కానీ పెద్ద స్కోరు మాత్రం చేయలేకపోయింది. అయినా కూడా వాళ్లు తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పెద్ద స్కోరు నమోదు చేయాలని చూశారు. టీమిండియా తరుఫున ఈ చివరి ఓవర్ వేయడానికి సూర్య.. హార్దిక్ పాండ్యాకు బాల్ ఇచ్చాడు, కానీ ఆ టైంలో గంభీర్ అకస్మాత్తుగా సంజు సామ్సన్ ద్వారా భారత జట్టుకు సందేశం పంపాడు. సంజు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడి హార్దిక్ బదులుగా కుల్దీప్ యాదవ్‌తో బౌలింగ్ వేయించమని చెప్పాడు. నిజానికి ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది, కానీ దీని ఫలితాలు తక్షణమే కనిపించాయి. చివరి ఓవర్‌లో కుల్దీప్ రెండు కీలకమైన వికెట్లను పడగొట్టి, దక్షిణాఫ్రికా కేవలం 117 పరుగులకే ఆలౌట్ చేశాడు.

READ ALSO: CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యం..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం HPCA స్టేడియంలో జరిగిన దక్షిణాఫ్రికా – భారతదేశం మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ 12 పరుగులకే అవుటయ్యాడు. అయిన భారత్ జట్టు ఇంకా 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ సందర్భంగా కెప్టె్న్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. “విషయం ఏమిటంటే, నేను నెట్స్‌లో అందంగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా నియంత్రణలో ఉన్న ప్రతిదాన్ని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేను పరుగుల కోసం కష్టపడుతున్నాను, ఫామ్‌లో లేనని కాదు, కానీ కచ్చితంగా పరుగులు చేయలేకపోతున్నాను” అని అన్నారు.

READ ALSO: Rahul Khanna: ఖన్నా బ్రదర్ న్యూడ్ ఫోటోషూట్‌తో వైరల్ ..

Exit mobile version