Site icon NTV Telugu

Team India playing XI: వరుణ్, అభిషేక్ విషయంలో సంచలన నిర్ణయం.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ లీక్!

Team India Playing Xi

Team India Playing Xi

Team India playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 తుది దశకు చేరుకుంది. నేడు గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ కప్పు ఎలాగైనా టీమిండియా కైవసం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు టీ20 వరల్డ్ కప్‌లను తన ఖాతాలో వేసుకున్న భారత్ మూడో కప్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్ గెలవలేదు. తొలి టైటిల్ గెలవాలని ఆ జట్టు తాపత్రయపడుతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ మైదానం ముస్తాబైంది. భారీ స్కోర్లు నమోదయ్యే పిచ్‌గా ఇది పేరుగాంచింది. తాజా పరిస్థితుల దృష్ట్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సమాన అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించే జట్టుకు మానసికంగా కొంత ఆధిక్యం ఉండే అవకాశముంది.

READ MORE: Venkatesh-Trivikram : ‘ఆదర్శ కుటుంబం’.. ఫ్యామిలీ డ్రామా అనుకుంటే పొరపాటే..

ఇదిలా ఉండగా.. తాజాగా ఇరు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ లెవన్‌లపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే టీమ్‌లో ఎలాంటి మార్పులు ఉండవని టీమిండియా కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతంలోనే క్లూ ఇచ్చేశారు. ఈ సీజన్‌లో ఫామ్‌లో లేకపోయినా.. అభిషేక్‌ను ఫైనల్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సూపర్-8 దశ నుంచి వరుణ్ చక్రవర్తి సరిగ్గా రాణించడం లేదు. ఫైనల్‌లో వరుణ్‌ను తప్పించాలని అనేక డిమాండ్లు వినిపించాయి. వరుణ్ బౌలింగ్‌లో భారీగా రన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ కొంత ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ 4 ఓవర్లలో 64 పరుగులిచ్చాడు. ఈ తరుణంలో వరుణ్‌ను పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో మాత్రమే ఆడిన కుల్దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. cricket addictor ప్రకారం.. కానీ.. ఫైనల్‌నూ కుల్దీప్‌కు అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో భారత్, న్యూజిలాండ్ జట్లు ముప్పై సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 18 మ్యాచ్‌లు గెలిచింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయినప్పటికీ ప్రపంచకప్ పోటీల్లో మాత్రం భారత్‌పై న్యూజిలాండ్‌కు మంచి రికార్డు ఉండటం ఈ ఫైనల్‌కు మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. cricket addictor ప్రకారం.. ఫైనల్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ అంచనాలు ఇవే..

READ MORE: Aakash Chopra: “ఇదే బెస్ట్ ఛాన్స్”.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ వార్తలు మధ్య ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు

భారత్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ అంచనా: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ అంచనా: ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్‌కాంచీ, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్.

 

 

Exit mobile version