India vs Australia: మహిళల ప్రపంచ కప్ 2025లో అతి పెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళల జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలకమైన పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, రెండు జట్లూ సెమీస్‌కు తగ్గట్టుగా వ్యూహాత్మక మార్పులతో బరిలోకి దిగాయి.
SEBI Recruitment 2025: సెబీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. అర్హులు వీరే
ఇందులో భారత జట్టు ప్లేయింగ్ XI లో ఏకంగా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనర్ ప్రతికా రావుల్ గాయం కారణంగా దూరం కావడంతో ఆమె స్థానంలో దూకుడుగా ఆడే యువ ఓపెనర్ షెఫాలీ వర్మను తీసుకున్నారు. దీంతోపాటు ఉమ, హర్లీన్ డియోల్ స్థానంలో వికెట్ కీపర్ రిచా ఘోష్, క్రాంతి గౌడ్ లకు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రీ-ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ ఎలిస్సా హీలీ తిరిగి జట్టులోకి రావడంతో ఆసీస్ కు మరింత బలం పెరిగింది. అలాగే జార్జియా వేర్‌హామ్ స్థానంలో సోఫీ మోలినెక్స్ జట్టులో చేరింది.
నిజానికి మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు సెమీఫైనల్‌లో ఓటమి అనేది చాలా అరుదు. సుదీర్ఘ కాలంగా వారు సెమీస్ గేటు దాటకుండా గెలుస్తూ వస్తున్నారు. అలాంటి తిరుగులేని జట్టును ఎదుర్కోవడం భారత జట్టుకు పెను సవాలే. అయితే, 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న చరిత్ర ఉంది. ఆ విజయాన్ని పునరావృతం చేయాలంటే నేటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. షెఫాలీ, స్మృతి మంధానల ఓపెనింగ్ జోడీ, దీప్తి శర్మ ఆల్‌రౌండర్ ప్రదర్శన భారత్ ఆశలను సజీవంగా ఉంచుతాయోలేదో. ఈ ఉత్కంఠభరిత పోరులో ఏ జట్టు ఫైనల్ బెర్తును దక్కించుకుంటుందో చూడాలి.
రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిన ఇన్‌స్పెక్టర్
భారత్ ప్లేయింగ్ XI: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎలిస్సా హీలీ (వికెట్ కీపర్/కెప్టెన్), ఎలిస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నబెల్ సదర్‌లాండ్, ఆష్లే గార్డ్‌నర్, తహలియా మెక్‌గ్రా, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగన్ షుట్.
