Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో మొదలు కానుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మెగా టెస్ట్ సిరీస్‌కు ముందు, తమ తమ జట్లకు ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకునే ఇద్దరు ఆటగాళ్ల గురించి విశేషాలు తెలుసుకోవాల్సిందే. దీంతో పాటు అత్యధిక టెస్టు వికెట్లు తీసే రేసులో వీరిద్దరూ ఒకరినొకరు అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు.. భారత క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో వీరిద్దరూ ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ ఏడో స్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా లియాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇప్పుడు వీరిద్దరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరిన్ని వికెట్లు తీయడం ద్వారా తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది.
Also Read: Ukraine War: అణ్వాయుధాల వినియోగానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్.. అమెరికాకి వార్నింగ్..
ఇక భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి చూస్తే.. 105 టెస్టు మ్యాచ్‌లు ఆడి 199 ఇన్నింగ్స్‌లలో 23.59 సగటుతో మొత్తం 536 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియాపై అతని గణాంకాలు కూడా చాలా బాగున్నాయి. కంగారూలపై 22 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 42 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 104 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు ఆస్ట్రేలియాలో 10 మ్యాచ్‌లు ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో 39 వికెట్లు తీశాడు. అశ్విన్ ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టగలడు.
Also Read: Health: ఉదయం పూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? ఈ సమస్య ఉన్నట్లే..
మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా అశ్విన్‌కు ఏమి తీసిపోడు. లియాన్ 129 మ్యాచ్‌లు ఆడి 242 ఇన్నింగ్స్‌లలో 30.28 సగటుతో 530 వికెట్లు పడగొట్టాడు. భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 49 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 121 వికెట్లు పడగొట్టాడు. అలాగే వారి స్వదేశంలో 67 మ్యాచ్‌లు ఆడి 126 ఇన్నింగ్స్‌ల్లో 259 వికెట్లు తీశాడు. అతని గణాంకాలను పరిశీలిస్తే, భారత బ్యాట్స్‌మెన్స్ అతనితో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.