Site icon NTV Telugu

IND vs AUS 4th Test : నాలుగో టెస్టుకు ప్రధాని కామెంట్రీ.. ఆత్రుతతో అభిమానులు

Test

Test

IND vs AUS 4th Test : భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ నేటి నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో నేటి తొలిరోజు ప్రత్యేకం. ఎందుకంటే టీమిండియా, ఆస్ట్రేలియాల ఉత్సాహాన్ని పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు మైదానంలో ఉంటారు. టాస్ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైదానంలో కనిపించనున్నారు. మోడీ వ్యాఖ్యానం చేస్తారనే టాక్ కూడా ఉంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌లోకి తిరిగి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోకి కాసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

Exit mobile version