Site icon NTV Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు..!

Rohit Sharma Century

Rohit Sharma Century

Rohit Sharma Hits His Slowest ODI Fifty: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు (అక్టోబర్ 23) అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. టాస్ ఓడిపోయిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. 24 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అజేయంగా నిలిచారు. రోహిత్ తన 59వ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. రోహిత్ శర్మ కి ఇదే అత్యంత స్లోయెస్ట్ (slowest) హాఫ్ సెంచరీ. 74 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు హిట్ మ్యాన్.. అంతే కాదు.. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు సైతం సృష్టించాడు రోహిత్.. వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

READ MORE: Mirai’s triumph : ఘనంగా జరిగిన ‘మిరాయ్‌’ విజయోత్సవ వేడుక..

కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచారు. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన 4 ఓవర్లోని నాలుగో బంతిని ఆడబోయి స్లిప్‌లో రెన్‌షాకు దొరికిపోయాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొన్నా పరుగుల ఖాతా తెరవలేదు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో కనోలీ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో విరాట్ పెవిలియన్‌కు చేరాడు.

Exit mobile version