NTV Telugu Site icon

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైం, లైవ్ స్ట్రీమింగ్.. ఫుల్ డిటైల్స్ ఇవే

Ind Vs Aus

Ind Vs Aus

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​కింద.. టీమిండియా నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో జరగనుంది. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరిగేవి.. అయితే ఈసారి ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలి. ప్రతి సెషన్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది.. ఏ సమయానికి ముగుస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడవచ్చు.. అన్నీ డిటైల్స్‌గా తెలుసుకుందాం.

Read Also: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్‌ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు

పెర్త్‌లో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే టాస్ అరగంట ముందుగా ఉదయం 7:20 గంటలకు జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 7:50 నుండి 9:50 వరకు కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ అనంతరం రెండో సెషన్‌ ఆట ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత టీ బ్రేక్ ఉంటుంది. చివరి సెషన్ ఆట మధ్యాహ్నం 12:50 నుండి 2:50 వరకు ఉంటుంది. ఆ తరువాత స్టంప్‌లు ఉంటాయి. (ఈ సమయం భారతీయ కాలమానం ప్రకారం).

Read Also: Medak Incident: నర్సాపూర్ పోలీసుల నిర్వాకం.. ఆరేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్

మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇండియాలో చూడవచ్చు. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, శుభ్‌మన్ గిల్ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. రెండో టెస్టు నుంచి భారత జట్టులోకి రోహిత్ ఎంట్రీ ఇస్తాడు. మహ్మద్ షమీ కూడా రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు టీమిండియాలో చేరే అవకాశం ఉంది. రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉంటే శుభ్‌మన్ గిల్ కూడా తిరిగి జట్టులోకి చేరుతాడు.

Show comments