NTV Telugu Site icon

INDvsAUS 1st Test: తొలిటెస్టులో టీమిండియా పైచేయి..వైరల్ అవుతున్న మీమ్స్

3

3

ఆస్ట్రేలియాతో జరుగుతన్న మొదటి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొడుతోంది. నాగ్‌పూర్ పిచ్‌పై మొదటి రోజు బౌలర్లు పెత్తనం చెలాయిస్తే.. రెండోరోజు బ్యాటర్లు దుమ్మురేపారు. దీంతో ఇప్పటికే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 144 రన్స్ లీడ్ సాధించింది. ఈ నేపథ్యంలోనే పలు మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆసీస్‌కు మాత్రమే పిచ్‌ భయంకరంగా కనబడుతోందని..భారత్ మాత్రం అలవోకగా ఆడుతోందని కామెంట్లు పేలుతున్నాయి. అలాగే రోహిత్ శర్మ సెంచరీ, జడేజా ఆల్‌రౌండ్ షోపైనా మీమ్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా.

ఆసీస్ బ్యాటర్లు తడబడ్డ పిచ్‌పై భారత బ్యాటర్లు దుమ్మురేపారు. మొదట కెప్టెన్ రోహిత్ (120) ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే అవసరమైన సమయంలో సంయమనం పాటిస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు. ఓ ఎండ్‌లో అశ్విన్ (23), కోహ్లీ (12), పూజారా (7), సూర్యకుమార్ (8) ఇలా వరుస వికెట్లు పడుతన్నా తాను మాత్రం గొప్పగా పోరాడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అనంతరం ఇతడికి బౌలింగ్‌లో అదరగొట్టిన జడేజా తోడయ్యాడు. ఇతడు కూడా ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ ఔటయ్యాక.. జడేజాతో కలిసిన అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 321 రన్స్ చేసింది. జడేజా (66 నాటౌట్), అక్షర్ (52 నాటౌట్) క్రీజులో ఉన్నారు.