Team India Loss Reasons: దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూసిన టీమిండియా-ఆస్ట్రేలియా తొలి వన్డేలో భారత్ ఓటమి మూటగట్టుకుంది. పెర్త్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి భారత్‌కు అదృష్టం కలిసి రాలేదు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ టాస్ ఓడిపోయింది, తర్వాత మ్యాచ్ దూరమైందని సగటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ భారత్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం…
READ ALSO: CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు వ్యాపారులతో మాట ముచ్చట!
భారత్‌ను దెబ్బకొట్టిన వర్షం..
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ను వర్షం గట్టి దెబ్బకొట్టింది. నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు టీమిండియా 136 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా ఎనిమిది వన్డే విజయాల తర్వాత భారత్‌కు ఇది తొలి ఓటమి. వాస్తవానికి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ప్రదర్శన సరిపోలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలంగా తర్వాత మైదానంలోకి అడుగు పెట్టి, పేలవమైన ప్రదర్శన చేశారు. వీరిద్దరి ఇన్సింగ్స్ మిగతా వారిని కూడా ప్రభావితం చేసిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వన్డే క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. స్టార్క్ వేసిన బంతిని వైడ్-స్వింగింగ్‌గా డ్రైవ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, బంతి అతని బ్యాట్ వెలుపలి అంచును తీసుకొని బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు వెళ్లింది. ఈ సమయంలో కొన్నోలీ అద్భుతమైన క్యాచ్ పట్టాడంతో కోహ్లీ ఎనిమిది బంతుల ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియాలో కోహ్లీ మొదటిసారి పరుగులు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. భారత జట్టు తమ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఎటువంటి ఊపును అందుకోలేకపోయింది. కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 38), అక్షర్ పటేల్ మినహా మరే బ్యాట్స్‌మన్ కూడా మంచి స్కోర్ చేయలేదు. చివరల్లో నితీష్ కుమార్ రెడ్డి రెండు సిక్సర్లు కొట్టి భారత్‌కు గౌరవ ప్రదమైన సోర్క్ అందించాడు.
నిరంతర వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా గెలవడానికి 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. DLS పద్ధతిలో.. 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులకే ట్రావిస్ హెడ్ వికెట్‌ను ఆస్ట్రేలియా కోల్పోయింది. హెడ్ 5 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు, కానీ ఆ తర్వాత కెప్టెన్ మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్ బాధ్యతను భుజాలకు వేసుకొని టీం ఇండియా నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. మిచెల్ మార్ష్ 52 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు.
వర్షం కారణంగా తక్కువ స్కోరు సాధించిన ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్‌తో పాటు, జోష్ ఫిలిప్ కూడా అద్భుతంగా రాణించాడు. ఫిలిప్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. మాట్ రెన్‌షా 24 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్‌తో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో భారత్ తరుఫున అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
READ ALSO: Lakshmi Puja Timings: ఈ టైమ్‌లో పూజిస్తే లక్షాధికారులు అవుతారు!
