Site icon NTV Telugu

Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ పూర్తి.. ఫలితాలు ఎప్పుడంటే..?

Mtv

Mtv

Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ పూర్తయింది. ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నాటికి కొత్త ఉపరాష్ట్రపతి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. 96 శాతం మంది సభ్యులు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదైందనే అంశంపై క్లారిటీ లేదు.

READ MORE: CM Chandrababu: దసరా మహోత్సవాలకు రండి.. సీఎంకు కనకదుర్గ ఆలయం అధికారుల ఆహ్వానం..

దేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో ఓటింగ్ జరిగింది. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా ఓటు వేశారు. ఓటింగ్ ప్రారంభానికి ముందు.. ఎన్డీఏ ఎంపీలు ఉదయం 9.30 గంటలకు అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. తమ అభ్యర్థి CP రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి బీ. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. 542 మంది లోక్‌సభ సభ్యులు, 239 మంది రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు ఉంది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపాయి. కానీ ఆ పార్టీ ఎంపీలు మాత్రం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్, ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కాకుండా ఎన్డీఏ అభ్యర్థి సీపీ.రాధాకృష్ణన్‌కు ఓటేశారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని ఆ ఎంపీలిద్దరూ ధిక్కరించారు.

READ MORE: Salman Lala: గ్యాంగ్‌స్టర్ అంత్యక్రియలు వేలాది మంది.. బాలివుడ్ నటుల సంతాపం.. ఇంతకీ ఎవరితను?

Exit mobile version