India UNSC Veto Power: భారతదేశం.. ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇండియా పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చలలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అనేక దేశాలు భారతదేశ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం మాత్రం రాలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి అనేక దేశాలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. అయినా భారత్‌కు వీటో పవర్‌ను దూరం చేస్తున్న అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Aghori-Sri Varshini: ఇక నా జోలికి వస్తే అంతే సంగతి.. అఘోరీకి శ్రీ వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంటే ఏమిటి?
ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తివంతమైన విభాగం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం, యుద్ధం, సంఘర్షణలను నివారించడం, అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడం, అవసరమైనప్పుడు ఆంక్షలు లేదా సైనిక చర్యలకు అధికారం ఇవ్వడం దీనిది ముఖ్యపాత్ర. భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉన్నాయి. వాటిలో ఐదు శాశ్వత సభ్యులు. అవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. వీటికి వీటో అధికారం ఉంది. అంటే వాటిలో ఏదైనా ఒక దేశం “వద్దు” అని చెబితే, ఆ తీర్మానం ఆమోదించబడదు. ఈ కౌన్సిల్‌లో 10 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. వాళ్లను రెండేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. శాశ్వత సభ్యుల్లో భారతదేశం కూడా ఒకటి.
భారత్‌కు మద్దతు ఇస్తున్న దేశాలు..
ఇటీవల రష్యా, భూటాన్, మారిషస్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ స్వయంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మాట్లాడుతూ.. 80 ఏళ్ల క్రితం (UN స్థాపించినప్పుడు) ఉన్న దానికంటే నేడు ప్రపంచ పరిస్థితి భిన్నంగా ఉందని, కాబట్టి UNSC సంస్కరణ అవసరమని అన్నారు. శాశ్వత స్థానాల కోసం భారతదేశం, బ్రెజిల్‌లకు రష్యా మద్దతు ఇచ్చింది. అలాగే మారిషస్, భూటాన్ దేశాలు కూడా భారత్ వీటో పవర్‌కు దన్నుగా నిలిచాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశం, జర్మనీ, బ్రెజిల్, జపాన్‌లను శాశ్వత సభ్యులుగా నియమించడాన్ని ఫ్రాన్స్ మరోసారి సమర్థించింది. UNSCలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా తన మద్దతును తెలిపింది.
ఇండియా వీటో పవర్‌ను అడ్డుకుంటుంది ఎవరు?
2024 లో రాజ్యసభలో భారత వీటో అధికారం గురించి ఒక ప్రశ్న అడిగారు. విదేశాంగ మంత్రిని ఎంపీ అబ్దుల్ వహాబ్ “UNSCలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నం ప్రస్తుత స్థితి ఏమిటి?” అని అడిగారు. గత మూడు ఏళ్లుగా ప్రభుత్వం ఈ దిశలో ఎలాంటి ప్రయత్నాలు చేసిందని ఆయన ప్రశ్నించారు? దీనికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందిస్తూ.. “భారతదేశానికి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం పొందడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం. UNSCలో శాశ్వత సభ్యత్వం పొందడానికి అన్ని సామర్థ్యాలు, అర్హతలు భారత్‌కు ఉన్నాయని ఆయన అన్నారు. భారతదేశం ద్వైపాక్షిక, బహుపాక్షిక స్థాయిలలో ఈ దిశలో చురుకుగా ముందుకు కదులుతుంది. భారతదేశం అంతర్-ప్రభుత్వ చర్చలలో (IGN) కూడా చురుకుగా పాల్గొంటోంది. సభ్య దేశాల నుంచి మద్దతు పొందడానికి భారతదేశం G-4 (భారతదేశం, జపాన్, బ్రెజిల్, జర్మనీ), L.69 గ్రూప్ (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహం) తో కలిసి పనిచేస్తోంది. భారతదేశం గ్లోబల్ సౌత్‌లోని దేశాలతో కూడా ఈ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
UNSCని సంస్కరించాలంటే ఏం చేయాలి..
UNSCని సంస్కరించాలంటే UN చార్టర్‌ను సవరించాలి. UN చార్టర్‌లోని ఆర్టికల్ 108 ప్రకారం.. జనరల్ అసెంబ్లీలో P5 శాశ్వత సభ్యులతో సహా మూడింట రెండు వంతుల మంది సభ్యులు దానిని ఆమోదించాలి. దానిని ఆమోదించిన తర్వాతనే ఏదైనా సవరణ అమలులోకి వస్తుంది. ఈ ప్రక్రియకు ఒక శాశ్వత సభ్యుడు (P5) వ్యతిరేకతంగా ఉన్న కూడా ఈ ప్రక్రియను నిలిపివేయవచ్చు. ఈ కూటమిలో చైనా శాశ్వత సభ్య దేశంగా ఉంది. ఇక్కడే భారత్‌కు వ్యతిరేక సర్వాలు వినిపిస్తున్నాయి. ఈ భారతదేశం శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం రెండింటినీ కలిగి ఉండాలని చైనా కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇది ఆసియాలో భారతదేశం ప్రభావాన్ని పెంచుతుందని బీజింగ్ అక్కసు. UNSC ప్రస్తుత కూర్పు (1945 నాటికి) ప్రస్తుత వాస్తవాలను ప్రతిబింబించడం లేదని భారతదేశం చాలా కాలంగా వాదిస్తోంది. UNSCలో ప్రస్తుతం ఐదు శాశ్వత సభ్యులు (P5) ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్. అయితే, వీటిలో ఆఫ్రికన్ దేశాలు నుంచి ప్రాతినిధ్యం లేదు. అందుకే భారతదేశం తన జనాభా, ఆర్థిక వ్యవస్థ, UN శాంతి పరిరక్షణ, ప్రపంచ స్థాయిలో భారత్ పాత్రను బట్టి, తనకు శాశ్వత సభ్యత్వానికి అర్హమైనదని వాదిస్తోంది.ఇప్పటివరకు భారతదేశం 8 సార్లు తాత్కాలిక సభ్యు దేశంగా ఎన్నికైంది.
భారత్ కల నిజం అవుతుందా..
వీటో అధికారం అనేది చాలా కీలకమైనది. భారతదేశం UNSC సభ్యత్వం పొందినప్పటికీ, దానికి వీటో పవర్ వస్తుందో, రాదో తెలియడం లేదు. ఇప్పటి వరకు వీటో అధికారం కేవలం P5 దేశాలకు మాత్రమే ఉంది. శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాలకు మాత్రమే ఉంది. కొత్త శాశ్వత సభ్యులకు వీటో ఇవ్వకూడదని, లేదంటే UNSC మరింత సంక్లిష్టంగా మారుతుందని ఇప్పటికే వీటో పవర్ కలిగి ఉన్న కొన్ని దేశాలు నమ్ముతున్నాయి. మరికొన్ని దేశాలు శాశ్వత సభ్యత్వం పొందితే, వారికి కూడా వీటో పవర్ ఇవ్వాలని, లేదంటే వారి సభ్యత్వం అసంపూర్ణంగా ఉంటుందని వాదిస్తున్నారు. భారతదేశం సమాన హోదాను కోరుకుంటుంది.. అంటే శాశ్వత సభ్యత్వం పొందితే వీటో అధికారాన్ని కూడా సాధించుకోవాలని చూస్తుంది.
READ ALSO: Israel Attack Pakistan: ఇజ్రాయెల్ దాడితో గజగజలాడిన పాక్.. తర్వాత ఏం జరిగిందంటే..
