Site icon NTV Telugu

Kaveri Engine: చరిత్ర సృష్టించే దిశగా భారత్.. సక్సెస్ అయితే నయా రికార్డే!

Kaveri Engine

Kaveri Engine

Kaveri Engine: చరిత్ర సృష్టించే దిశగా భారత్ అడుగులు వేయబోతుంది. ఈ కొత్త పరీక్ష సక్సెస్ అయితే ఇండియా నయా రికార్డ్‌ను సృష్టిస్తుంది. DRDO వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలో తేలికపాటి పోరాట విమానం (LCA) తేజస్‌లో పూర్తి స్వదేశీ కావేరీ ఇంజిన్‌ను పరీక్షించనున్నారు. భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్‌ను విమానంలో పరీక్షించడం ఇదే మొదటిసారి. తేజస్‌లో కావేరీ ఇంజిన్‌ను పరీక్షించడం ద్వారా అభివృద్ధి ప్రక్రియ పూర్తవుతుందని DRDO వర్గాలు తెలిపాయి. ఈ పరీక్ష విజయవంతంగా పూర్తి అయితే DRDO బృందానికి కొత్త ఆత్మవిశ్వాసం లభించడంతో పాటు ఇండియ తన సొంత ఇంజిన్‌ను అభివృద్ధి చేసిందని ప్రపంచానికి రుజువు చేస్తుంది. అప్పుడు దీనిని యుద్ధ విమానంలో విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసి పరీక్షించవచ్చు. ఇంతకీ కావేరీ ఇంజిన్ కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: జీఎస్‌టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!

విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు..
ప్రస్తుతం తేజస్‌లో US జనరల్ ఎలక్ట్రిక్ F404, F414 ఇంజిన్‌లు వాడుతున్నారు. కావేరీ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షిస్తే, ఇండియా ఇకపై విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు ఈ ప్రయోగం“మేక్ ఇన్ ఇండియా”, “ఆత్మనిర్భర్ భారత్”‌లను బలోపేతం చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి DRDO, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ప్రైవేట్ పరిశ్రమల మధ్య చర్చలు పూర్తయ్యాయి. వైమానిక దళం నేతృత్వంలో తేజస్‌లో ఇంజిన్‌ను ఇన్‌స్టాల్ చేసే పనిని HAL చూసుకుంటుంది.

ఎలా పరీక్షిస్తారు..
కావేరీ ఇంజిన్‌పై గ్రౌండ్ రన్, ఆల్టిట్యూడ్ సిమ్యులేషన్ వంటి అనేక పరీక్షలు ఇప్పటికే జరిగాయి. ఇప్పుడు దీనిని తేజస్‌లో కూడా అమర్చనున్నారు. ప్రారంభ విమానాలు తక్కువ-రిస్క్ ప్రొఫైల్‌లో ఉంటాయి. ఇంజిన్ స్థిరత్వం, థ్రస్ట్, విమానం వ్యవస్థలతో అనుకూలతను ఈ పరీక్షలో పరీక్షిస్తారు. అన్నీ సరిగ్గా జరిగితే ఈ ఇంజిన్ రాబోయే 23 ఏళ్ల కార్యాచరణ ఉపయోగం కోసం పని చేయనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై ఆధారపడి కావేరీ ఇంజిన్ రూపకల్పన ఉంటుందని సమాచారం. ఇది అధునాతన మెటల్, డిజిటల్ నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంది. ఇది తేజస్‌కు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో డ్రోన్‌లు, హెలికాప్టర్లు, తదుపరి తరం యుద్ధ విమానాలకు కూడా వినియోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నట్లు సమాచారం.

35 ఏళ్ల తర్వాత అసలు పరీక్ష..
1989లో భారతదేశం కావేరీ ఇంజిన్ ప్రాజెక్టుపై పని ప్రారంభించింది. దీనిని బెంగళూరులోని DRDO గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE) ప్రారంభించింది. దేశీయ ఇంజిన్‌తో భారత వైమానిక దళం కోసం స్వదేశీ యుద్ధ విమానం LCA తేజస్‌కు శక్తినివ్వడం ఈ ఇంజిన్ లక్ష్యం. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం.. తేజస్ కావేరీ ఇంజిన్‌తో ఎగరాలి, కానీ సాంకేతిక సవాళ్లు, అవసరమైన థ్రస్ట్ (8890 కిలో న్యూటన్) సకాలంలో అందుకోకపోవడం వల్ల, ఈ ఇంజిన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. 2010 తర్వాత దీనిని తేజస్ నుంచి తొలగించి, విదేశీ ఇంజిన్‌లను (GE F404, F414) తేజస్‌కు ఉపయోగించారు. తరువాత కావేరీ ఇంజిన్‌లను డ్రోన్‌లు (UAV), ఇతర ప్రాజెక్టుల కోసం తిరిగి డిజైన్ చేశారు. తాజా 2025లో సుమారు 35 ఏళ్ల తర్వాత తేజస్‌పై దీన్ని మళ్లీ పరీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.

READ ALSO: Vice President Election 2025: ఎన్డీఏ vs ఇండియా రె’ఢీ’.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరి బలమెంత?

Exit mobile version