India T20 World Cup Squad: భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన వెంటనే పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మలను జట్టులోకి తీసుకోకపోవడం వార్తల్లో నిలిచింది. సెలెక్టర్లు వ్యక్తిగతం కంటే జట్టు అవసరాలు, వ్యూహాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఒకవైపు స్పష్టమైన ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు జట్టు ప్లానింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయనే భావనను కూడా కలిగిస్తోంది. టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద నిర్ణయమే. కానీ గిల్ తాజా ఫామ్‌ను చూస్తే ఆ నిర్ణయానికి కారణం అర్థమవుతుంది. గిల్ వరుసగా 18 టీ20 ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేయలేకపోయాడు. చివరి 15 మ్యాచ్‌లలో చేసిన పరుగులు 291 మాత్రమే. సగటు 24.35, స్ట్రైక్‌రేట్ 137.26. అదే సమయంలో అభిషేక్ శర్మ 188కు పైగా స్ట్రైక్‌రేట్‌తో సంజూ శాంసన్ 180 పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నారు. వీళ్లతో పోలిస్తే.. గిల్ ఆట కాస్త నెమ్మదిగా కనిపించింది. “మాకు టాప్‌లో రెండు వికెట్‌కీపర్లు కావాలి” అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వివరించారు. సంజూ శాంసన్ ఓపెనర్-కీపర్‌గా ఖరారవ్వగా, బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకున్నారు. దీంతో గిల్‌కు చోటు లేకుండా పోయింది. ఆధునిక టీ20ల్లో వేగంగా ఆడే బ్యాట్స్‌మెన్‌లకే ప్రాధాన్యం ఉంటుందని సెలెక్టర్లు భావించారు. అయితే గిల్ ప్రతిభను మాత్రం ఎవ్వరూ ప్రశ్నించలేరు. వన్డేలు, టెస్టుల్లో గిల్ బాగా రాణించాడు. ఇప్పుడు గిల్ తాత్కాలికంగానే ఫామ్‌ను కోల్పోయాని పిస్తుంది. కాగా.. టీం నుంచి గిల్ ను ఔట్ చేయడం కఠినంగా అనిపించినా.. గణాంకాలు, వ్యూహాల
పరంగా న్యాయంగానే ఉంది.
READ MORE: Astrology: డిసెంబర్ 21, ఆదివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!
జితేష్ శర్మ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఫినిషర్‌గా తన పని సరిగానే చేశాడు. జట్టు ఎంపికకు ఒక్కరోజు ముందు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వికెట్‌కీపింగ్ చేస్తూ నాలుగు డిస్మిసల్స్ చేసి ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేశాడు. అతన్ని తీసుకోకపోవడం ఫామ్ కారణం కాదు. సంజూ శాంసన్ ఓపెనర్‌గా ఉండటం, ఇషాన్ కిషన్ బ్యాకప్‌గా ఉండటంతో మరో కీపర్-ఫినిషర్ అవసరం లేదని సెలెక్టర్లు భావించారు. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే లోయర్ ఆర్డర్‌లో ఉన్నారు. సునీల్ గవాస్కర్ కూడా “జితేష్ శర్మ విషయంలో బాధగా ఉంది. అతను తప్పేం చేయలేదు” అని అన్నారు. గిల్‌ను టాప్‌లో పెట్టడానికి మొదట జితేష్‌ను జట్టులో ఉంచారు. తర్వాత గిల్‌ను తీసేయడంతో జితేష్‌కు ఉన్న కారణమే లేకుండా పోయింది. ఇది జట్టు ప్లానింగ్ లోపాన్ని చూపిస్తోంది.
READ MORE: India vs Pakistan: నేడు ఇండియా vs పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్.. హుషారుగా భారత్ టీం
జట్టులో అతి పెద్ద ప్రశ్న ఇషాన్ కిషన్ ఎంపికే. రెండు సంవత్సరాల తర్వాత కిషన్‌ను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో 517 పరుగులు, దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో ఝార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించి ఎంపికకు అర్హత సంపాదించాడు. కానీ అంతర్జాతీయ టీ20ల్లో అతడి పాత రికార్డు చూస్తే సందేహాలు వస్తున్నాయి. దేశవాళీ ఫామ్ నేరుగా ప్రపంచకప్ ఒత్తిడిలో పనిచేస్తుందా అన్నదే ప్రశ్న. ఇషాన్ విఫలమైతే, జితేష్ లేకపోవడమే విమర్శల కేంద్రంగా మారుతుంది. మొత్తానికి చూస్తే, ఈ రెండు తప్పింపులు వ్యూహాత్మకంగా సరైనవే. గిల్ ఫామ్ తొలగించడం కరెక్టే. జితేష్‌ను తీసుకోకపోవడం కాస్త కఠినంగా అనిపించినా, జట్టు సమతుల్యత కోణంలో ఇది కూడా మంచి నిర్ణయమే.
