Site icon NTV Telugu

Agni 5 Missiles: అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

Agni 5

Agni 5

Agni 5 Missiles: 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఎంతో ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి. గతంలో కంటే ఇప్పుడు తేలికైన క్షిపణిలో కొత్త సాంకేతికతలు, పరికరాలను ధృవీకరించడానికి ఈ పరీక్ష జరిగింది. అవసరమైతే అగ్ని -5 క్షిపణి పరిధిని పెంచే సామర్థ్యాన్ని ఈ ట్రయల్ నిరూపించిందని తెలిపాయి.

Elephant Herd Attack: కార్లపై ఏనుగుల గుంపు దాడి.. చిన్నారితో సహా ముగ్గురు మృతి

ఈ క్షిపణి దాదాపు 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, సుమారు 50 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ఒక టన్ను కంటే ఎక్కువ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ.. తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. ఈ ఖండాతర క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.

Exit mobile version