Smart Phone market: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢీలా..27 శాతం తగ్గుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సరఫరా ఢీలా పడింది. అక్టోబర్-డిసంబర్‌లో దేశీయంగా స్మార్ట్ ఫోన్ల సరఫరాలు 27 శాతానికి పైగా తగ్గి 2.96 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే 2021లో ఇదే మూడు నెలల్లో 4.06 కోట్ల స్మార్ట్ ఫోన్లు సరఫరా అయ్యాయని మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్లే ఈసారి మార్కెట్లో తగ్గుదల కనిపించిందని పేర్కొంది. చిప్‌ల సరఫరా మెరుగుపడినా, అన్ని రకాల సేవలు-వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుతున్నాయని వివరించింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పనికోసం చాలామంది కొత్త స్మార్ట్ ఫోన్లు కొనడం వల్ల కూడా ప్రస్తతం గిరాకీ పరిమితమై ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యతరగతి వర్గాల పైనే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉండి.. అందుబాటు ధర స్మార్ట్ఫోన్ల కొనులుగో తగ్గి ఉండొచ్చని పేర్కొంది. కాగా, ఖరీదైన స్మార్ట్ఫోన్ల సరఫరాలో పెరుగుదల కనిపించడం గమనార్హం.
Also Read: D Boss: ప్రేమికుల రోజు అయిపోగానే బాస్ సినిమా అప్డేట్ వస్తుంది…
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
బడ్జెట్ ఫోన్లపైనే ప్రభావం
ఐడీసీ రూపొందించిన నివేదిక ప్రకారం.. రూ.25,000లోపు ధర ఫోన్ల సరఫరాలు 15% తగ్గాయి. అయితే రూ.25,000 – 41,000 శ్రేణిలోని మధ్య స్థాయి, ప్రీమియం ఫోన్ల సరఫరాలు మాత్రం 20% పెరిగాయి. రూ.41,000 పైన ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సరఫరాలు 55% రాణించడం విశేషం. ప్రారంభ స్థాయి అంటే రూ.12,500 లోపు ధర స్మార్ట్ఫోన్లు సరఫరాలు 54 శాతం నుంచి 46 శాతానికి పరిమితయ్యాయి. ఈ విభాగంలో కొత్త ఫోన్లు రాకపోవడంతో వృద్ధి పరిమితమైంది. పెరుగుతున్న ధరలు, అదనపు నిల్వల కారణంగా 2023 ప్రథమార్ధం వరకు ఇబ్బందులు కనిపించొచ్చు. కాగా, మార్కెట్ వాటా విషయంలో డిసెంబరు త్రైమాసికంలో 18.6%, వార్షికంగా 21% వాటాతో షియోమీ అగ్రస్థానంలో ఉంది. అయితే సరఫరాలు సంఖ్యాపరంగా చూస్తే డిసెంబరు త్రైమాసికంలో 38.3%, వార్షికంగా 25% తగ్గాయి. ప్రీమియం విభాగంలో 60% మార్కెట్ వాటాతో యాపిల్ అగ్రస్థానంలో ఉండగా, శామ్సంగ్ 21% వాటా పొందింది. 2022లో మొత్తంమీద 20.1 కోట్ల సెల్ఫోన్లు ఇండియన్ మార్కెట్లో సరఫరా అయ్యాయి. 2021తో పోలిస్తే ఇవి 12% తక్కువ. ఇందులో ఫీచర్ ఫోన్లు 5.7 కోట్లు ఉన్నాయి. వీటి సరఫరాలు కూడా 18% తగ్గాయి.
Also Read: Amit Shah: నేడే ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!