Site icon NTV Telugu

Brahmos Missiles: మరో 10 రోజుల్లో బ్రహ్మోస్ క్షిపణి లాంచర్ల ఎగుమతి..

Brahmos Missiles

Brahmos Missiles

DRDO: రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసివ్వడంలో అద్భుతమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగానికి అవసరమయ్యే లాంచర్ లను దేశీయంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరో పది రోజుల్లో వీటిని ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన పలు ఉత్పత్తులు త్రివిధ దళాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దాదాపుగా 4.94 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఇప్పటి వరకు ఆర్మీకి అందజేశాం.. రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఉత్పత్తులను అందజేస్తామని డీఆర్డీవో చీఫ్ వెల్లడించారు.

Read Also: Prasanth Varma : సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన అలా వచ్చింది..

అయితే, గడిచిన ఐదారేళ్లలో రక్షణ శాఖ సమకూర్చుకున్న వివిధ ఉత్పత్తులలో 60 నుంచి 70 శాతం ఉత్పత్తులను డీఆర్డీవో అభివృద్ధి చేసినవేనని డాక్టర్ కామత్ తెలిపారు. ఇలాంటివి ముందు ముందు మరింత పెరుగుతుందని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణులను రష్యాతో కలిసి తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్ లను డీఆర్డీవో డెవలప్మెంట్ చేస్తుందని చెప్పారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం.. మరో 10 రోజుల్లో తొలి కన్ సైన్ మెంట్ పంపించబోతున్నామని వెల్లడించారు. డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ ను నిలబెడుతున్నట్లు డీఆర్డీవో చీఫ్ కమాత్ తెలిపారు.

Exit mobile version