NTV Telugu Site icon

Suguna Chicken: మొదట్లో రూ.5వేలతో ప్రారంభం.. నేడు రూ.12వేలకోట్ల టర్నోవర్

New Project (2)

New Project (2)

Soundararajan: బి సౌందరరాజన్, జిబి సౌందరరాజన్ భారతదేశంలోని అత్యంత ధనిక పౌల్ట్రీ రైతులు. ఈ ఇద్దరు సోదరులు 1984లో రూ.5000 పెట్టుబడితో తమ పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కోయంబత్తూరుకు 72 కి.మీ దూరంలోని ఉడుమలైపేట్టైలో వారి మొదటి పౌల్ట్రీ ఫారం ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అంటే 40ఏళ్ల తర్వాత వారు రూ. 12,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో భారతదేశంలో అతిపెద్ద పౌల్ట్రీ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.

వారి సంస్థ పేరు సుగుణ ఫుడ్స్.. దాదాపు 18 రాష్ట్రాల్లోని 15,000 గ్రామాల నుండి 40,000 మంది రైతులతో పని చేస్తుంది. బి సౌందరరాజన్ దిగ్గజం కంపెనీకి చైర్మన్. ఆయన కుమారుడు విఘ్నేష్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుగుణ ఫుడ్స్‌కు దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇది బ్రాయిలర్ చికెన్, గుడ్లలో మార్కెట్ లీడర్.

Read Also:YV Subba Reddy : చంద్రబాబు, పవన్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు

సుందరరాజన్ స్కూలింగ్ తర్వాత పని చేయడం ప్రారంభించాడు. కూరగాయలు పండించడం స్టార్ట్ చేసి అందులో లాభాలు ఆశించిన మేరకు రాకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ వ్యవసాయ పంపు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తరువాత అతను తన సోదరుడి వ్యాపారంలో చేరడానికి తిరిగి వచ్చాడు. అతని ప్రారంభ వ్యాపారం కోడి దాణాను రైతులకు విక్రయించడం. ఈ క్రమంలోనే కోళ్ల పెంపకంలో ఎదురవుతున్న సవాళ్లను రైతుల నుంచి తెలుసుకున్నారు. అప్పుడు అతను కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం రైతులను నియమించాలని ఆలోచించాడు. ఇది భారతదేశంలో ప్రత్యేకమైన భావన. అతను 1990లో కేవలం ముగ్గురు రైతులతో ఈ నమూనాను ప్రారంభించాడు.

బి సౌందరరాజన్, జిబి సుందరరాజన్ కోళ్ల పెంపకానికి కావాల్సినవన్నీ రైతులకు అందించారు. అప్పుడు రైతులు డబ్బుకు బదులుగా ఎదిగిన పక్షులను వారికి ఇచ్చేవారు. ఆ తర్వాత 7 ఏళ్లలో 40 మంది రైతులు వారితో చేరారు. అప్పట్లో అతని టర్నోవర్ రూ.7 కోట్లకు చేరుకుంది. సుగుణ చికెన్ అనతికాలంలోనే తమిళనాడులో పేరుగాంచింది. కంపెనీ తరువాత ఈ రైతులకు ఉత్పత్తులను ఆరోగ్యకరమైన పద్ధతిలో పండించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ప్రారంభించింది. కోళ్ల పెంపకానికి రైతులకు డబ్బులు చెల్లిస్తారు.

రైతులకు ప్రతి రెండు నెలలకోసారి కనీస గ్రోయింగ్ చార్జీ వస్తుంది. వారి వ్యాపారంలో వ్యవసాయ వ్యాపారం సహకారం 80 శాతానికి పైగా ఉంది. ఈ ఉత్పత్తులను మాంసం, గుడ్లు విక్రయించే మార్కెట్లలో విక్రయిస్తారు. కంపెనీ పశుగ్రాసాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. వ్యాపార నేపథ్యం లేదా విద్యార్హత లేనప్పటికీ అతను తన వ్యాపారాన్ని పెంచుకోగలిగాడు. 2021 ఆర్థిక సంవత్సరంలో వారి టర్నోవర్ రూ. 9,155.04 కోట్లు. 2020 ఆర్థిక సంవత్సరంలో వారి టర్నోవర్ రూ. 8739 కోట్లు. 2021 ఆర్థిక సంవత్సరంలో అతని లాభం రూ. 358.89 కోట్లుగా నమోదైంది.

Read Also:Krithi Shetty: చినుకునైనా కాకపోతిని నిన్ను తాకగా.. వర్షంలో బుల్లి డ్రెస్ లో బేబమ్మ

Show comments