NTV Telugu Site icon

Indian Aviation Industry : 2030 నాటికి 30కోట్లమంది ప్రయాణీకులు.. అర్జంట్ గా 2840 విమానాలు అవసరం

New Project (59)

New Project (59)

Indian Aviation Industry : దేశంలో విమానాల్లో ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా వేగంగా పెరుగుతోంది. 2023 క్యాలెండర్ సంవత్సరంలో విమాన ప్రయాణీకుల రద్దీ 153 మిలియన్లు (15.3 కోట్లు). 2030 నాటికి దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య రెండింతలు అంటే 300 మిలియన్లు (30 కోట్లు) పెరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి పాల్గొన్నారు. ఆ సందర్బంలో కోవిడ్‌కు ముందు ఉన్న కాలాన్ని దేశీయ విమానాల రాకపోకలు అధిగమించాయని ఆయన అన్నారు. గత దశాబ్దంలో దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ ఏటా 15 శాతం చొప్పున పెరుగుతుండగా అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.1 శాతం చొప్పున పెరుగుతోందని ఆయన చెప్పారు. భారత దేశీయ విమానయాన మార్కెట్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది. అంతర్జాతీయ పౌర విమానయాన మార్కెట్ ఏడో స్థానంలో ఉందని, రెండూ కలిస్తే ప్రపంచంలో భారత్ ఐదో స్థానంలో ఉందని ఆయన అన్నారు.

Read Also:Gold Price Today : మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

ఒక వైపు భారతదేశ పౌర విమానయాన మార్కెట్ నిరంతరం వృద్ధి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 2040 నాటికి భారత్‌కు 2840 కొత్త విమానాలు అవసరమవుతాయని ఎయిర్‌బస్ ఇండియా అండ్ సౌత్ ఏషియా ఎండీ రమీ మైలార్డ్ చెప్పారు. ఈ అనేక విమానాలతోపాటు భారత్‌కు 41,000 మంది పైలట్లు, 47,000 మంది సాంకేతిక సిబ్బంది అవసరమని ఆయన చెప్పారు. ఎయిర్‌బస్ ప్రస్తుతం భారత్ నుంచి 750 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంటోందని, ఈ దశాబ్దం చివరి నాటికి దీనిని 1.5 బిలియన్ డాలర్లకు పెంచుతామని ఆయన చెప్పారు.

ఒకవైపు దేశీయ విమాన ప్రయాణాలకు భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు గో ఫస్ట్‌ ఆపరేషన్‌ నిలిచిపోయింది. ఇది ఇతర విమానయాన సంస్థలపై ఒత్తిడి తెచ్చింది. దేశంలో పెరుగుతున్న ఏవియేషన్ మార్కెట్ దృష్ట్యా విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేయగా, ఇండిగో 500 విమానాలను ఆర్డర్ చేసింది. గురువారం నాడు అకాసా ఎయిర్ 150 కొత్త బోయింగ్ 737 మ్యాక్స్ కొనుగోలు చేయడానికి ఆర్డర్ చేసింది.

Read Also:Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ స‌ర్జ‌రీ సక్సెస్.. బరిలోకి దిగేది ఎప్పుడంటే?