NTV Telugu Site icon

Plastic Waste: ఎక్కడ చూసినా చెత్తే.. ఇలాగే ఉంటే మన బతుకులు అంతే?

Single Use Plastic Ban

Single Use Plastic Ban

Plastic Waste: ప్రస్తుతం ఏ కోణంలో చూసినా అన్నింటా అగ్రదేశానికి అన్ని అర్హతలు భారతదేశానికి ఉన్నాయి. ఓ పక్క అభివృద్ధిలో దేశం దూసుకుపోతుంటే.. మరో పక్క చెత్త సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుంది. రోజురోజుకు జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారత్లో ప్లాస్టిక్ వినియోగం కూడా అంతే మొత్తంలో పెరుగుతోంది. దీన్ని నివారించకపోతే భవిష్యత్తులో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిందే..

భారతదేశంలో ప్రతీ ఏడాది దాదాపు 34లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 30 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. ఈ ఐదేళ్ల వ్యవధిలో, దేశంలో ప్లాస్టిక్ వినియోగం వార్షిక ప్రాతిపదికన 9.7 శాతం పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 14 మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అయింది. అది ఏకంగా 2019-20 నాటికి 20 మిలియన్ టన్నులకు చేరింది. మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ దేశ రాజధాని ఢిల్లీలో విడుదల చేసిన తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ‘ప్లాస్టిక్, సంభావ్యత & అవకాశాలు'(ప్లాస్టిక్ పొటెన్షియల్ అండ్ పాసిబిలిటీస్) అనే నివేదికలో భారతదేశంలోని ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి కూడా ఈ కాలానికి మధ్య రెట్టింపు అయినట్లు తెలిపింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ సహకారంతో ఈ నివేదికను రూపొందించారు.

Read Also: Hindu Temple Attacked: హిందూ దేవాలయంపై దాడి.. ఖలిస్తాన్ మద్దతుదారుల దుశ్చర్య

భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు కలిసి 38 శాతం వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. గత ఐదేళ్లలో భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం చాలా వేగంగా పెరిగిందని, అందువల్ల దాని వ్యర్థాలు కూడా పెరిగాయని ఈ నివేదికలో చెప్పబడింది. డంపింగ్‌కు బదులుగా రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి భారతదేశంలో ‘ల్యాండ్‌ఫిల్’ & ‘ఇన్‌సినరేషన్’ పన్ను విధించాలని నివేదిక సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో విసిరే చెత్త, ప్లాస్టిక్‌ను తిని జంతువులు అనారోగ్యం బారిన పడుతున్నాయి.

ప్రథమ్ అనే సంస్థ విడుదల చేసిన ‘రూరల్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స్టడీ 2022’ నివేదికలో స్క్రాప్ డీలర్లు కూడా కొనుగోలు చేయని చెత్తలో 67 శాతం గ్రామీణ కుటుంబాలు నిత్యం ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చేస్తున్నాయని తెలిపింది. దేశంలోని 15 నగరాల్లోని 70 జిల్లాల్లోని మొత్తం 700 గ్రామాలను ఈ నివేదికలో పొందుపరిచారు. గ్రామీణ భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల స్థితిని అర్థం చేసుకోవడానికి ఈ సంస్థ అధ్యయనం మొదలుపెట్టింది. ఈ నివేదికలో దేశంలోని చాలా గ్రామాల్లో చెత్త నిర్వహణకు కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిసింది.

Read Also: Ind vs SL 2nd Odi: చాహల్ స్థానంలో కుల్దీప్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ప్లాస్టిక్ సమస్య పరిష్కారానికి రీసైక్లింగ్ సరిపోదు..
దేశంలో కేవలం 36 శాతం గ్రామాల్లో మాత్రమే వ్యర్థపదార్థాల కోసం పబ్లిక్‌ డస్ట్‌బిన్‌ వ్యవస్థ ఉంది. అదే సమయంలో దాదాపు 70 శాతం గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు వాహనాలు లేవు. 47 శాతం గ్రామాల్లో మాత్రమే స్వీపర్లు ఉన్నారు. గ్రామాల్లోని జనరల్‌ స్టోర్లు, మెడికల్‌ దుకాణాలు, క్లినిక్‌లు, ఆసుపత్రులు, తినుబండారాలు ఇలా చాలా చోట్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అధ్యయనం చేసిన 50కి పైగా సంస్థల దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి చుట్టూ పేపర్, కార్డ్‌బోర్డ్, రేపర్లు, సీసాలు, డబ్బాలు వంటి ప్లాస్టిక్ వ్యర్థాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లు ఈ గ్రామాల్లో పెను సమస్యను సృష్టిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే దేశ ప్రజల సహకారం చాలా కావాలని నిపుణులు కోరుతున్నారు.

Show comments