Site icon NTV Telugu

Indian Air Force Strength: చైనాను వెనక్కి నెట్టిన భారత్.. యూఎస్, రష్యా తర్వాత ఇండియానే..

India Air Force Ranking 202

India Air Force Ranking 202

Indian Air Force Strength: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనాను భారత్ వెనక్కి నెట్టింది. ఎందులో అనుకుంటున్నారు.. వైమానిక దళంలో భారతదేశం చైనాను అధిగమించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, రష్యా తర్వాత ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళాన్ని కలిగి ఉంది భారతదేశం.

READ ALSO: India Warns Pakistan: ఆఫ్ఘన్‌కు బాసటగా భారత్.. పాక్‌కు నేరుగా హెచ్చరికలు జారీ చేసిన ఇండియా

WDMMA ర్యాంకింగ్‌లను ఎలా లెక్కిస్తుంది..
ఏటా ప్రపంచవ్యాప్తంగా వైమానిక దళాల బలాన్ని WDMMA అంచనా వేస్తుంది. ఈ ర్యాంకింగ్ కేవలం విమానాల సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది పోరాట శక్తి, రక్షణ సామర్థ్యాలు, లాజిస్టికల్ మద్దతు, శిక్షణ, సాంకేతిక పురోగతిని పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తుంది. పాకిస్థాన్ వైమానిక దళం చైనా నుంచి ఆయుధాల కొనుగోళ్లపై ఆధారపడుతుంది, కానీ భారతదేశం సాంకేతికత, శిక్షణలో దాయాదిని అధిగమిస్తుంది.

నివేదికలోని దేశాల ర్యాంకింగ్…
1. అమెరికా 242.9
2. రష్యా 114.2
3. భారతదేశం 69.4
4. చైనా 63.8
5. జపాన్ 58.1
6. ఇజ్రాయెల్ 56.3
7. ఫ్రాన్స్ 55.3

చైనాకు ఎక్కువ యుద్ధ విమానాలు ఉన్నా కూడా..
వాస్తవానికి చైనాకు భారతదేశం కంటే ఎక్కువ యుద్ధ విమానాలను ఉన్నాయి. కానీ భారత వైమానిక దళం (IAF) చైనా యుద్ధ విమానాల కంటే మరింత ఆధునికమైనదిగా ఉన్నట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో భారత యుద్ధ విమానాల పని తీరు స్పష్టంగా కనిపించింది. ఈ యుద్ధంలో భారత వైమానిక దళం పాక్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆపరేషన్ సింధూర్ టైంలో నియంత్రణ రేఖ వెంట 100 మంది దాయాది సైనికులు మరణించారని, కనీసం 12 విమానాలు ధ్వంసమయ్యాయని భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు.

చైనా తన వైమానిక దళాన్ని అప్‌గ్రేడ్ కోసం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. కానీ భారతదేశం కేవలం యంత్రాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, పోరాట సంసిద్ధతపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది. భారత వైమానిక దళం నిజమైన బలం దాని అత్యున్నత శిక్షణ, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం, కచ్చితత్వంలో ఉంది. భారత్‌కు కలిసి వచ్చే మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. త్రివిధ దళాల (భూమి, సముద్రం, వాయు) మధ్య కూడా మంచి సమన్వయం ఉంది. యుద్ధ సమయాల్లో వీటి భాగస్వామ్యం వైరి పక్షాలను మట్టి కరిపించడంలో ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Chiranjeevi : ఆ విషయంలో చిరు గ్రేట్.. మనసున్న మెగాస్టార్..

Exit mobile version