న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. అతిథ్య న్యూజి లాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగలు చేసింది.కాగా ఆరంభంలోనే మిచెల్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ శుభారంభాన్ని అందిచాడు. 42 బాల్స్‌లో 70 పరుగులు చేశాడు. దీపక్ చాహార్ బౌలింగ్‌లో శ్రేయస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మరో బ్యాట్స్‌మెన్ చాప్‌మెన్ 63 పరుగులు చేశాడు. చాప్ మెన్ అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత ఫిలిప్స్‌ను అశ్విన్ ఎల్‌బీడబ్ల్యూగా వెనకకు పంపాడు.సీఫెర్ట్ 12 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో సూర్యకు మార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రచన్ రవీంద్ర, 7 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా భారత బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహార్, సిరాజ్ చెరో ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 165 పరుగులు చేయాల్సి ఉంది.
