Site icon NTV Telugu

Lanza-N 3D-Radar: ఇండియన్ నేవీలో స్వదేశీ 3D వైమానిక నిఘా రాడార్.. ఇక పాకిస్థాన్‌కు చుక్కలే..!

Lanza N 3d Radar

Lanza N 3d Radar

Lanza-N 3D-Radar: టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), స్పానిష్ రక్షణ సంస్థ ఇంద్రాతో కలిసి భారత నావికాదళం కోసం మొట్టమొదటి 3D ఎయిర్ సర్వైలెన్స్ రాడార్ (3D-ASR) – లాంజా-N ను ప్రారంభించింది. ఈ రాడార్‌ను భారత నావికాదళ యుద్ధనౌకలో ఏర్పాటు చేశారు. ఇది రక్షణాయుధాల ఉత్పత్తిరంగంలో మన దేశం సాధించిన తొలి అడుగు. ఇక మన పొరుగున ఉన్న శత్రుదేశాలు పాకిస్థాన్, చైనాలకు ఇది ఓ చేదు వార్తల మిగిలిపోతుంది.

READ MORE: Nepal: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో 54 ఏళ్ల వ్యక్తి.. ఇంతకీ ఎవరు ఈయన?

లాంజా-ఎన్ రాడార్ అంటే ఏమిటి?
లాంజా-ఎన్ అనేది స్పానిష్ కంపెనీ ఇంద్రా లాంజా 3D రాడార్ నావికా వెర్షన్. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ, క్షిపణి నిరోధక రాడార్లలో ఒకటి. ఈ రాడార్ వాయు, ఉపరితల లక్ష్యాలను 3Dలో ట్రాక్ చేస్తుంది. దీని పరిధి 254 నాటికల్ మైళ్ళు (సుమారు 470 కి.మీ). ఇది డ్రోన్లు, సూపర్సోనిక్ ఫైటర్ జెట్‌లు, యాంటీ-రేడియేషన్ క్షిపణులు, నావికా స్థానాలను గుర్తించగలదు. వాతావరణం సరిగ్గా లేని సమయంలోనూ సక్రమంగా పని చేయగలదు. శత్రు దాడులను నివారించడంలో నైపుణ్యం కలిగి ఉంటుంది. దీనిని హిందూ మహాసముద్రం యొక్క తేమ, వేడికి తట్టుకునేలా మార్చారు. ఈ రాడార్ యుద్ధనౌక అన్ని వ్యవస్థలతో అనుసంధానించారు. ఎన్నో కఠినమైన సముద్ర పరీక్షలు చేసి ఆమోదించారు. ట్రయల్స్‌లో వివిధ నావికా, వైమానిక వ్యవస్థలను ఉపయోగించారు.

READ MORE: Kakinada : ఉప్పాడ బీచ్‌లో అలల ఆగ్రహం, కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేత

ఈ విజయం 2020లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL), స్పానిష్ కంపెనీ ఇంద్రా మధ్య కుదిరిన ఒప్పందం ఫలితం. ఈ ఒప్పందంతో 23 రాడార్‌లను డెలివరీ చేయడానికి వీలు కల్పిస్తుంది. వాటిలో మూడు పూర్తిగా ఇంద్ర నుంచి భారత్‌కు రానున్నాయి. మిగిలిన 20 రాడార్‌లను టాటా భారతదేశంలో అసెంబుల్ చేస్తుంది. టాటా కర్ణాటకలో రాడార్ అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. డెలివరీని వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. ఈ రాడార్‌ను భారత నావికాదళానికి చెందిన ఫ్రిగేట్‌లు, డిస్ట్రాయర్లు, విమాన వాహక నౌకలపై ఏర్పాటు చేస్తారు. నావికాదళ నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా శత్రు డ్రోన్‌లు, జెట్‌లు, క్షిపణులకు ట్రాక్ చేస్తుంది. ప్రస్తుతం మొదటి రాడార్‌ను యుద్ధనౌకపై ఏర్పాటు చేశారు. మిగిలినవి త్వరలో రానున్నాయి.

Exit mobile version