కొంతకాలంగా టీమిండియా బౌలింగ్‌లో కొత్తదనం కనపిస్తోంది. బుమ్రా గాయంతో దూరమవగా యంగ్ పేసర్లకు అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ భారత బౌలర్లు అద్భుతంగా పెర్ఫామెన్స్ చేశారు. ఇదే విషయమై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా బౌలింగ్‌పై కామెంట్స్ చేశాడు. పాక్ బౌలింగ్‌ను టీమిండియా కాపీ కొట్టిందని చెప్పుకొచ్చాడు. తమ బౌలింగ్‌ను చూసే ఇండియా తమ అటాక్‌ను రూపొందించుకుందని అనడం గమనార్హం. తన యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడాడు.
Also Read: Petrol Rate: రాష్ట్ర బడ్జెట్‌లో సామాన్యులకు షాక్.. పెట్రోల్ ధర రూ.2 పెంపు
“పాకిస్తాన్‌ను చూసే ఇండియా తమ బౌలింగ్ కూర్పును రూపొందించిందని నాకు తరచూ అనిపిస్తుంది. హరీస్ రౌఫ్ లాంటి పేస్ ఉమ్రాన్ మాలిక్ సొంతం. ఇక షహీన్ అఫ్రిది లాగా అర్ష్‌దీప్ లెఫ్టార్మ్ వెరైటీని అందిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వసీం జూనియర్ లాగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇద్దరి పేస్ ఒకేలా ఉంటుంది. ఇక శివమ్ మావి సపోర్టింగ్ బౌలర్ పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇండియా స్పిన్ బౌలింగ్ పాక్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా పాకిస్తాన్ ఈ విషయంలోనే మెరగవ్వాలని భావిస్తాను” అని రమీజ్ అన్నాడు.
Also Read: WhatsApp: 36 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఒక్క నెలలోనే!
ఇకపోతే, అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపారు. 235 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన కివీస్‌ను 12.1 ఓవర్లలో 66 పరుగులకే కట్టడి చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 వికెట్లతో సత్తాచాటగా.. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, శివం మావి చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఈ మ్యాచ్‌లో బారీ విజయం సాధించిన టీమిండియా 2-1తో సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్‌లో మునిగిపోయింది.