Site icon NTV Telugu

India Japan Deals: జపాన్-భారత్ మధ్య కీలక ఒప్పందాలు.. 10 ఏళ్లలో 10 ట్రిలియన్ యెన్‌ల పెట్టుబడి..

Modi Japan Visit

Modi Japan Visit

India Japan Deals: రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ టోక్యో చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన శుక్రవారం జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో శిఖరాగ్ర చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా ఇరుదేశాల మధ్య మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడం ఈ సమావేశం ముఖ్యలక్ష్యమని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలను ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఇషిబా కుదుర్చుకున్నారు. అనంతరం ఇద్దరు దేశాధినేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

READ ALSO: Tamannaah : బీర్ అంటే ఒక ఎమోషన్ అంటున్న తమన్నా..

సువర్ణ అధ్యాయానికి పునాది వేశాము..
ప్రధాని నరేంద్రం మోడీ మాట్లాడుతూ.. “ఈరోజు మా చర్చలు ఉపయోగకరంగా, ఉద్దేశపూర్వకంగా జరిగాయి. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు, శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, భద్రతకు కూడా అవసరమని మేము అంగీకరిస్తున్నాము. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంలో బలమైన ప్రజాస్వామ్యాలు సహజ భాగస్వాములు. ఈ రోజు మా ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంలో సువర్ణ అధ్యాయానికి పునాది వేశాము. రాబోయే దశాబ్దానికి మేము ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాము. మా ప్రణాళికలో పెట్టుబడి, ఆవిష్కరణ, ఆర్థిక భద్రత, పర్యావరణం, సాంకేతికత, ఆరోగ్యం, మొదలైనవి ఉన్నాయి” అని అన్నారు. అనంతరం జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా మాట్లాడుతూ.. 6 ఏళ్ల క్రితం తన వారణాసి పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘2019 ఆగస్టులో వారణాసిని సందర్శించే అదృష్టం నాకు లభించింది. ప్రాచీన భారతీయ చరిత్రను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని తన ప్రసంగంలో అన్నారు.

రాబోయే 10 ఏళ్లలో భారతదేశంలో జపాన్ నుంచి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. చిన్న, మధ్య తరహా సంస్థలు, స్టార్టప్లను అనుసంధానించడంపై ఇరుదేశాల నుంచి ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరమ్లోలో ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ కోసం జపాన్ కంపెనీలకు కూడా పిలుపునిచ్చినట్లు తెలిపారు. డిజిటల్ పార్టనర్ షిప్ 2.0, AI కోఆపరేషన్ ఇనిషియేటిప్‌పై కలిసి పని చేయాలని, సెమీకండక్టర్లు, అరుదైన భూమి ఖనిజాలు తమ ఎజెండాలో అగ్రస్థానంలో ఉన్నాయన్నారు. జపాన్ టెక్నాలజీ భారతీయ ప్రతిభ విజయవంతమైన కలయికని తాము నమ్ముతున్నామని చెప్పారు. చంద్రయాన్ 5 మిషన్‌లో సహకారం కోసం, ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్), JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ- JAXA) మధ్య ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. తమ క్రియాశీల సహకారం భూమి పరిమితులను అధిగమిస్తుందని, అంతరిక్షంలో మానవాళి పురోగతికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

READ ALSO: Indian Naval Power: పాక్‌ను గడగడలాడించిన మిగ్-29 విమానాలు..

Exit mobile version