RBI Data: పడిపోతున్న విదేశీ మారక నిల్వలు.. ప్రస్తుతం ఉన్నవి 601.45 బిలియన్ డాలర్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Data: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కనిపిస్తోంది. దీని ప్రభావం ఆగస్టు 4తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గుముఖం పట్టాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 601.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి.
Read Also:Newsclick Case: న్యూస్‌క్లిక్‌పై చర్యలు తీసుకోవాలి.. రాష్ర్టపతి, సీజేఐలకు ప్రముఖుల లేఖలు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
విదేశీ మారక నిల్వల డేటాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 4తో ముగిసిన వారంలో భారతదేశ ఫారెక్స్ నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 601.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.93 బిలియన్ డాలర్లు తగ్గి 533.40 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఆర్‌బీఐ బంగారం నిల్వలు కూడా తగ్గి 224 మిలియన్ డాలర్లు తగ్గి 44.68 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు 86 మిలియన్ డాలర్లు తగ్గి 5.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Read Also:Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ
గత రెండు వారాలుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరుపుతున్నారు. దీని కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఆర్‌బీఐ వద్ద డాలర్ నిల్వలు తగ్గడానికి ఇదే కారణం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిల్వలు తగ్గాయి. శుక్రవారం ఆగస్టు 11, 2023 నాడు డాలర్‌తో రూపాయి 14 పైసలు క్షీణించి రూ. 82.84 వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇప్పటికీ 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఉండడం ఊరటనిచ్చే అంశం. అక్టోబర్ 2021లో భారతదేశ విదేశీ మారక నిల్వలు 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!