BCCI: ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్పును కైవసం చేసుకుంది. సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఇక ఇదే జోష్‌లో టీమిండియా మరో కప్పుపై దృష్టి పెట్టింది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్పును కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మే నెలలో ఐపీఎల్ ముగిసిన వెంనే ఇక వన్డే ఫార్మట్‌పై దృష్టి సారించుంది. ప్రస్తుతం వన్డేలో రోహత్, కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. కేవలం వన్డేలోనే కొనసాగుతున్న ఈ ఇద్దరి ప్లేయర్‌కు తగినంత ప్రాక్టీస్ లభించేలా విదేశీ బోర్డులు చేస్తున్న ప్రతిపాదనలకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది.
READ MORE: Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం.. మేలో ఐపీఎల్ ముగుస్తుంది. ఇక జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ సిరీస్ భారత్‌లో కొనసాగనుంది. ఈ టెస్ట్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే మళ్లీ ఇంగ్లాండ్‌కు టీమిండియా జట్టు పయనం కావాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌తో ఐదు 20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఇదే పర్యటనలో ఐర్లాండ్‌తో సైతం చిన్న ఫార్మాట్ సిరీస్ ఆడే అవకావం ఉంది. ఇక్కడితో ముగియ లేదు.. శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లతోనూ టీమిండియా తలపడనుంది. రోహిత్, కోహ్లీల క్రేజ్ దృష్ట్యా తమ పర్యటనల్లో మరిన్ని వన్డేలను చేర్చాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే కోరగా, బీసీసీఐ అందుకు మొగ్గు చూపుతోంది. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ ఆశా జ్యోతి కోహ్లీ ఇప్పటికే ఐపీఎల్ కసరత్తు ప్రారంభించాడు. ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రెండోసారి కప్పు కొట్టాలని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. భారత దిగ్గజాలు సిద్ధమవుతున్నారు.
