Cooking Oil Prices: సామాన్య ప్రజలకు గుడ్న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు

  • త్వరలో తగ్గనున్న వంటనూనెల ధరలు..
  • మే 31 నుంచి అమల్లోకి రానున్న తగ్గిన ధరలు..
  • క్రూడ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించిన కేంద్రం
Cooking Iol

Cooking Iol

Cooking Oil Prices: వంటనూనెల ధరలు మరింత తగ్గే ఛాన్సులు కనిపిస్తున్నాయి. క్రూడ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 31వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలియజేసింది. ప్రస్తుతం క్రూడ్‌ పామాయిల్‌, క్రూడ్‌ సోయా ఆయిల్‌, క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌పై 20 శాతం దిగుమతి ట్యాక్స్ విధిస్తున్నారు. కాగా, భారతదేశంలో వినియోగిస్తున్న వంట నూనెల్లో 70 శాతం దిగుమతులపైనే ఆధార పడుతుంది.

Read Also: Abhishek Sharma Speech: పాపం రా బాబు.. అభిషేక్ స్పీచ్ కు భారత్ ఆటగాళ్ల ఎక్సప్రెషన్స్ చూస్తే నవ్వులు ఆగవుగా.. వీడియో వైరల్!

ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి భారీగా పామాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటున్నాం.. అలాగే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్‌, రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే, డిమాండ్‌ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూడు చమురులపై మొత్తం దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి దిగి రానున్నాయి. సెప్టెంబర్‌ 2024లో క్రూడ్‌, రిఫైన్‌ వంట నూనెలపై కస్టమ్స్‌ సుంకాన్ని 20 శాతానికి పెంచిన విషయం అందరికి తెలిసిందే.