Site icon NTV Telugu

ఇండియాలో పెరుగుతున్న కరోనా… కొత్తగా 45,083 కేసులు

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి మన దేశం లో మళ్లీ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 45,083 కొత్త కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు 3,26,95,903 కేసులు న‌మోద‌వ్వగా, ఇందులో 3,18,88,642 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,68,558 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,37,830 కి చేరింది. ఇక 24 గంట‌ల్లో ఇండియాలో 35,840 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది.

Exit mobile version