టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
- WCL 2026..
- ఇండియా చాంపియన్స్ ఔట్..
- లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Champions Knocked Out of WCL 2026: వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా చాంపియన్స్ ప్రయాణం ముగిసింది. టోర్నీలో భాగంగా మంగళవారం షార్జా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్ చాంపియన్స్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఇండియా చాంపియన్స్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయి లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా చాంపియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నామన్ ఓఝా తొలి ఓవర్లోనే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప 16 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత కూడా భారత బ్యాటర్ల నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదు. కెప్టెన్ యువరాజ్ సింగ్ 4 బంతుల్లో 4 పరుగులకే పరిమితమయ్యాడు. యూసుఫ్ పఠాన్ 20 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశాడు. అంబటి రాయుడు ఖాతా తెరవకుండానే రనౌట్ కాగా.. స్టువర్ట్ బిన్నీ ఒక్క పరుగు, పీయూష్ చావ్లా 7 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో ఇండియా చాంపియన్స్ 61 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
Also Read
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
ఈ దశలో రిషి ధావన్, హర్భజన్ సింగ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 38 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రిషి ధావన్ 32 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేయగా.. హర్భజన్ సింగ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 28 పరుగులు సాధించాడు. దీంతో ఇండియా చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రాయాడ్ ఎమ్రిట్ రెండు వికెట్లు పడగొట్టగా. రేమన్ రీఫర్, షెల్డన్ కాట్రెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, కార్లోస్ బ్రాత్‌వైట్, నికితా మిల్లర్ తలో వికెట్ తీశారు.
110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ చాంపియన్స్‌కు కూడా ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ క్రిస్ గేల్ 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి ధవల్ కులకర్ణి బౌలింగ్‌లో హర్భజన్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే చాడ్విక్ వాల్టన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను వెస్టిండీస్ వైపు తిప్పాడు. లెండల్ సిమన్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సిమన్స్ 26 బంతుల్లో 22 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత జెర్మైన్ బ్లాక్‌వుడ్ 5 పరుగులకే రిషి ధావన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వాల్టన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడు. రేమన్ రీఫర్తో కలిసి నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. చివరకు 15వ ఓవర్లో ధవల్ కులకర్ణి బౌలింగ్‌లో వాల్టన్ ఔటయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్ వెస్టిండీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
వాల్టన్ 43 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రేమన్ రీఫర్ 11 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కార్లోస్ బ్రాత్‌వైట్ ఒక పరుగుతో అజేయంగా ఉన్నాడు. దీంతో వెస్టిండీస్ చాంపియన్స్ 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ఇండియా చాంపియన్స్‌కు టోర్నీలో వరుసగా నాలుగో పరాజయం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టోర్నీలో ఆస్ట్రేలియా చాంపియన్స్‌పై సాధించిన విజయం మాత్రమే ఇండియా చాంపియన్స్ ఖాతాలో ఉంది. మరోవైపు వెస్టిండీస్ చాంపియన్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆరు జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా చాంపియన్స్ మాత్రం కీలక మ్యాచ్‌లో ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
The stage is set as West Indies Champions take on India Champions.
#wcl #worldchampionshipoflegends #indiachampions #westindieschampions https://t.co/fk7LRExoKF
— World Championship Of Legends (@WclLeague) October 13, 2026
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!