Site icon NTV Telugu

India Breaks Pakistan Record: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే!

Ind

Ind

India Breaks Pakistan Record: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. అయితే, ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా చేధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, జాతీయ జట్టుకు రెండేళ్లకు పైగా విరామం తర్వాత తుది టీంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీఎంట్రీని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కేవలం 32 బంతుల్లో 76 పరుగులు చేయగా.. అందులో 11 ఫోర్లు, 4 సిక్సులతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక, తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన కిషన్, పుల్ షాట్లు, పిక్-అప్ షాట్లు, రివర్స్ స్వీప్‌లతో స్టేడియంలోని ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు.

Read Also: IND vs NZ: ఇషాన్, సూర్య మెరుపు ఇన్నింగ్స్‌లు.. రెండో టీ20లో 209 రన్స్ ఉఫ్!

ఇక, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత తన తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి అసాధారణ ఇన్సింగ్స్ ఆడాడు. అతడితో పాటు శివమ్ దూబే కూడా 18 బంతుల్లో 36 రన్స్ చేసి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరి భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపుకు తిప్పేసింది. చేజింజ్ ప్రారంభంలో భారత్‌కు షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ రెండో ఓవర్‌కే ఔట్ కావడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అయితే, ఆ తర్వాత ఇషన్ కిషన్ చేసిన కౌంటర్ అటాక్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఇషన్ ఈ ప్రదర్శన సంజూ శాంసన్ స్థానంపై మరింత ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ సాధించిన తర్వాత తిలక్ వర్మ తిరిగి జట్టులోకి వస్తే 3వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ కోసం పోటీ మరింత పెరగనుంది.

అయితే, న్యూజిలాండ్‌పై ఈ ఘన విజయంతో భారత్ క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 209 పరుగుల లక్ష్యాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే చేధించడంతో అరుదైన రికార్డును నమోదు చేసింది భారత్.

కాగా, తక్కువ బంతుల్లో 200 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించిన జట్లు ఇవే!
* 28 బంతులు – 2026లో రాయ్‌పూర్‌లో భారత్ vs న్యూజిలాండ్ (లక్ష్యం: 209)
* 24 బంతులు – 2025లో ఆక్లాండ్‌లో పాకిస్తాన్ vs న్యూజిలాండ్ (లక్ష్యం: 205)
* 23 బంతులు – 2025లో బాస్సెటెర్రేలో ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ (లక్ష్యం: 215)

Exit mobile version