NTV Telugu Site icon

India vs England: తొలి ఇన్సింగ్స్ లో భారత్ ఆలౌట్.. జడేజా సెంచరీ మిస్..

Eng Ind

Eng Ind

Ind vs Eng: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ సేన ఆలౌట్ అయింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 421/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 15 పరుగులు మాత్రమే చేసి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఇక, ఇవాళ బ్యాటింగ్‌ స్టార్ట్ చేసిన భారత్‌కు జో రూట్‌ షాక్‌ ఇచ్చాడు. సెంచరీ చేసేలా కనిపించిన రవీంద్ర జడేజా (87)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అయితే జడేజా ఔట్‌ డౌట్ ఫుల్ గా మారింది. రిప్లైలో ప్యాడ్‌ కన్నా ముందే బ్యాట్‌ తాకినట్లు కనిపించింది.. కానీ అంపైర్‌ మాత్రం దాన్ని అవుగా ప్రకటించడంతో జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Read Also: Bihar Politics: బిహార్ లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..

ఇక, ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తొలి బంతికే రూట్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లో చివరి బంతికి అక్షర్‌ పటేల్‌ కూడా అవుట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో 121 ఓవర్లలో భారత్ 436 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (87), కేఎల్‌ రాహుల్‌ (86), యశస్వి జైశ్వాల్‌ (80)లు బాగా రాణించారు. అయితే, ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్పెషలిస్ట్‌ బౌలర్ల కంటే కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్ జో రూట్‌ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. టీమిండియా బ్యాటర్లను రెగ్యులర్ బౌలర్ల కంటే ఎక్కువగా జో రూట్ ఇబ్బంది పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 4 వికెట్లు తీసుకున్నాడు. టామ్‌ హార్ట్లీ, రెహాన్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు తీసుకోగా జాక్‌ లీచ్‌ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా 436 రన్స్‌ చేయగా.. 190 పరుగుల అధిక్యంలో భారత్ ఉంది.