Site icon NTV Telugu

HAMMER Bomb: ప్రాణాంతక ఆయుధం తయారీకి భారత్ సిద్ధం.. పాక్ గజగజలాడాల్సిందే!

Hammer Bomb

Hammer Bomb

HAMMER Bomb: దేశంలో హామర్ స్మార్ట్ బాంబును తయారు చేయడానికి ఇండియాకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) – ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ & డిఫెన్స్ (సఫ్రాన్) అధికారికంగా ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.

ఈ ఒప్పందంపై BEL.. CMD మనోజ్ జైన్, సఫ్రాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకం చేశారు. గతంలో ఫిబ్రవరి 2025లో ఏరో ఇండియా సందర్భంగా రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నేడు ఆ ఒప్పందం జాయింట్ వెంచర్ కంపెనీ (JVC) ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. కొత్త కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంటుంది. ఇందులో BEL – సఫ్రాన్ 50% వాటాలను సమానంగా కలిగి ఉండనున్నాయి.

READ ALSO: Afghanistan – Pakistan: సరైన సమయంలో పాకిస్థాన్‌కు రిటన్ గిఫ్ట్ ఇస్తాం: తాలిబన్లు

హామర్ అంటే..
ఇది ఫ్రాన్స్‌లో అత్యంత అధునాతనమైన ఎయిర్-టు-గ్రౌండ్ స్మార్ట్ బాంబు. రాఫెల్ ఫైటర్ జెట్ దీనిని ఉపయోగించి 70 కిలోమీటర్ల దూరం నుంచి శత్రువు బంకర్‌లు, కమాండ్ సెంటర్‌లు, రాడార్లు, వంతెనలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది చాలా తెలివైన బాంబు, ఇది గగనతలంలో తన మార్గాన్ని మార్చుకోగలదు. ఇది జామింగ్‌కు తలొగ్గదు. ఇప్పటికే దీనిని యుద్ధంలో చాలాసార్లు పరీక్షించారు. ఇప్పుడు ఈ బాంబు భారతదేశంలో తయారు చేయనున్నారు. ప్రారంభంలో కొన్ని విడిభాగాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు, కానీ క్రమంగా 60% వరకు విడిభాగాలను భారతదేశంలో తయారు చేస్తారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విడిభాగాలు, మొదలైన అన్నీ విడిభాగాలు దేశంలోనే తయారు చేస్తారని అధికారులు తెలిపారు. ఈ బాంబుల తయారీ, పరీక్ష, నాణ్యత తనిఖీలను BEL స్వయంగా నిర్వహిస్తుంది.

దీంతో భారత వైమానిక దళం, నావికాదళం తమకు కావలసినన్ని హామర్‌లను పొందగలుగుతాయి. తద్వారా ఇండియా విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. అలాగే దేశంలో వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. దీంతో పాటు తేజస్ ఫైటర్ జెట్‌లో కూడా హామర్‌లను అమర్చవచ్చు. యుద్ధ సమయంలో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి భారతదేశంలో నిర్వహణ, అప్‌గ్రేడ్‌లు జరుగుతాయి. అతి తర్వలో ఈ అత్యంత ప్రాణాంతక ఆయుధం భారత గడ్డపై తయారు కాబోతుంది.

READ ALSO: Andhra King Thaluka: ఈసారి కింగ్ రామేనట.. సెన్సార్ రివ్యూ

Exit mobile version