Site icon NTV Telugu

INDvsAUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా

Ro

Ro

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత గడ్డపై ఈసారి ఎలాగైనా సిరీస్ గెలిచే తీరాలన్న కసితో ఆసీస్ ఉండగా.. మరోసారి తన రికార్డును కొనసాగించాలని చూస్తోంది రోహిత్‌సేన. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలిటెస్టు కోసం ఇప్పటికే నాగ్‌పూర్‌ చేరుకున్న ఇండియా నెట్‌ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా త్రోడౌన్‌ స్పెషలిస్టులతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

అదే విధంగా భారత వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా, యువ వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ కూడా చాలా సమయం నెట్స్‌లోనే గడిపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. మరోవైపు ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. బెంగళూరు సమీపంలోని ఆలూర్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ పిచ్‌లకు తగినట్లు పిచ్ తయారు చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ఈ సిరీస్‌ హోరాహోరీగా జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: WPL 2023: విమెన్స్ ఐపీఎల్ తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే!

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్‌

Exit mobile version