Site icon NTV Telugu

Pakistani Aircraft Ban: పాకిస్తాన్ కు మరో షాక్.. పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం

Pak

Pak

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు (NOTAM) నోటీసు జారీ చేసింది. ఈ నోటామ్ కింద, ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అన్ని పాకిస్తాన్-రిజిస్టర్డ్, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read:CSK vs PBKS: ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానాన్ని భారత గగనతలంలోకి అనుమతించరు. ఈ నిర్ణయం భారతదేశం నుంచి వచ్చిన బలమైన సందేశంగా పరిగణించబడింది. పాక్ రెచ్చగొట్టే చర్యకు పాల్పడితే, భారత్ కఠినంగా స్పందిస్తుందని స్పష్టమైన సంకేతాలనిచ్చింది. గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, సరిహద్దు కార్యకలాపాలు పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి. కాగ పాక్ గగనతలంపై భారత్ విమానాల రాకపోకలకు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Also Read:Pakistan: ‘‘ కాశ్మీర్ వెళ్లండి, ఇక్కడేం పని’’.. పాక్ ఆర్మీ, పోలీసుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్..

జమ్మూ కాశ్మీర్ కు అన్ని విమానాలు రద్దు

భారత్ దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. భద్రతా కారణాలను చూపుతూ బుధవారం గిల్గిట్, స్కార్డు, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలకు అన్ని విమానాలను రద్దు చేసింది. జాతీయ గగనతల భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించిన తర్వాత ఉత్తర ప్రాంతాలకు విమానాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. విదేశీ విమానాలపై కఠినమైన పర్యవేక్షణ చేపట్టారు. భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానయాన సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Exit mobile version