NTV Telugu Site icon

బ్రేకింగ్ : భారత్ లో మరో వ్యాక్సిన్ కు అనుమతి

దేశంలో మూడో టీకా కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్పుత్నిక్ టీకాకు ఆమోదం కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో అందుబాటులోకి రానుంది రష్యా వ్యాక్సిన్. దేశంలో టీకా కొరత వేధిస్తోంది. దీంతో స్ఫుత్నిక్‌కు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురానున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే, దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ తర్వాత అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ అవుతుంది.