Vice Presidential Election:ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా అలయన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఇండియా అలయన్స్ కు చెందిన కనీసం 20 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఊహించిన దానికంటే 25 ఓట్లు ఎక్కువగా పొందారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థికి మద్దతుదారుల పూర్తి స్థాయిలో ఓట్లు రాలేదు.
READ MORE: Sathyan Sivakumar: 500 ఎకరాల ఆస్తికి వారసుడు ఈ తమిళ నటుడు, ఒక్క తప్పుతో అంతా నాశనం..
ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ మొత్తం 452 ఓట్లు పొందారు. ఇది ఎన్డీఏ ఎంపీల మొత్తం సామర్థ్యం కంటే 25 ఎక్కువ. కాగా, భారత కూటమి అభ్యర్థి బీ సుదర్శన్ రెడ్డి మొత్తం 300 ఓట్లు పొందారు. ఆయనకు ఇండియా కూటమి సామర్థ్యం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో స్వంత ఓట్లను సైతం పొందలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి.
